Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త చనిపోయి రెండున్నరేళ్లైంది.. పండంటి పాపకు జన్మనిచ్చిన పోలీసాఫీసర్ భార్య.. ఎలా?

భర్త హత్యకు గురైయ్యాడు. భార్య రెండున్నరేళ్ల తర్వాత పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. ప్రపంచ వైద్య శాస్త్రంలో ఈ ఘటన అద్భుతం చేసింది. వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 2014లో న్

Advertiesment
భర్త చనిపోయి రెండున్నరేళ్లైంది.. పండంటి పాపకు జన్మనిచ్చిన పోలీసాఫీసర్ భార్య.. ఎలా?
, గురువారం, 27 జులై 2017 (12:03 IST)
భర్త హత్యకు గురైయ్యాడు. భార్య రెండున్నరేళ్ల తర్వాత పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. ప్రపంచ వైద్య శాస్త్రంలో ఈ ఘటన అద్భుతం చేసింది. వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 2014లో న్యూయార్క్ పోలీసు అధికారి వెంజియాన్ లియూ, అతని సహ అధికారి రఫాలే రామోస్‌లతో కలసి పెట్రోలింగ్ కారులో ప్రయాణిస్తుండగా లియూ హత్యకు గురైయ్యారు. రఫాలే కూడా దుండగుల చేతిలో బలైపోయాడు. ఈ క్రమంలో లియూ మృతదేహం ఆస్పత్రిలో ఉన్న సమయంలో అతని వీర్యకణాలను తీసి భద్రపరచాలని భార్య పియా క్సియా చెన్ వైద్యులను కోరింది. 
 
భార్య విజ్ఞప్తి మేరకు పోలీస్ ఆఫీసర్ లియూ మృతదేహం నుంచి వీర్యాన్ని సేకరించిన డాక్టర్లు దాన్ని భద్రపరిచారు. దాదాపు ఏడాదిన్నర తరువాత, ఆమె అదే వీర్యంతో కృత్రిమ గర్భదారణ పద్ధతులను అనుసరించి గర్భం దాల్చింది. తాజాగా మంగళవారం నాడు అంటే, భర్త చనిపోయిన రెండున్నరేళ్ల తరువాత, న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ హాస్పిటల్‌లో పండంటి పాపకు జన్మనిచ్చింది.
 
దీనిపై లియూ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తన కుమారుడిని కోల్పోయిన బాధలో ఉన్న తమకు.. మనవరాలు పుట్టడం ఎంతో సంతోషాన్నిచ్చిందని చెప్పారు. లియూ లేని మూడేళ్లు చాలా బాధకు గురయ్యామని.. తమ కోడలు పండంటి పాపాయిని తమ చేతుల్లో పెట్టిందని.. ఆ పాపాయి ముఖంలో లియూను చూసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఇకపోతే విధుల్లో ఉండగా మరణించిన తొలి ఆసియన్ అమెరికన్ పోలీస్ ఆఫీసర్‌గా లియో నిలవడం గమనార్హం. ఆయన అంత్యక్రియలకు వేలాది మంది పోలీసులు హాజరయ్యారు. తాజాగా లియూ కుమార్తెకు పోలీస్ టోపీని ధరించిన ఫోటోను న్యూయార్క్ పోలీసు శాఖ విడుదల చేసింది. జూనియర్ లియూ పుట్టిందని సోషల్ మీడియాలో ఫోటోలు విడుదల చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

31న ఉద్దానంలోని కిడ్నీ బాధితుల కోసం చంద్రబాబుతో పవన్‌ భేటీ