Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

31న ఉద్దానంలోని కిడ్నీ బాధితుల కోసం చంద్రబాబుతో పవన్‌ భేటీ

ఉద్దానంలోని కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఈనెల 31వ తేదీన భేటీకానున్నారు. ఉద్దానంలోని కిడ్నీ బాధితు

Advertiesment
Pawan kalyan
, గురువారం, 27 జులై 2017 (12:02 IST)
ఉద్దానంలోని కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఈనెల 31వ తేదీన భేటీకానున్నారు. ఉద్దానంలోని కిడ్నీ బాధితుల సమస్యలపై, వారి కోసం ఆ ప్రాంతంలో చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారని తెలిసింది. 
 
ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లిన పవన్.. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఆ సందర్భంగా అక్కడి మెడికల్‌ స్కూల్‌ వైద్యులతో మాట్లాడుతూ.. ఉద్దానంలోని కిడ్నీ బాధితులు పెరగడం, వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై చర్చించారు. స్కూల్‌ రీజినల్‌ విభాగం ముఖ్య వైద్యుడు జోసెఫ్‌ బెన్వంత్రీ నేతృత్వంలోని బృందం ఉద్దానంలో పర్యటించనుంది. 
 
ఇందుకు సంబంధించిన కార్యక్రమం కూడా ఇప్పటికే ఖరారు చేశారు. 29న జోసెఫ్‌ బృందం ఉద్దానంలో పర్యటించి ప్రాథమికంగా వివరాలను సేకరిస్తుంది. అక్కడి ప్రజలతో మాట్లాడతారు. అనంతరం 30న విశాఖపట్నంలో హార్వర్డ్‌ వైద్యులతో పవన్‌ సమావేశమై చర్చిస్తారు. అనంతరం పవన్‌, వైద్యులు ముఖ్యమంత్రితో భేటీ అయి ఉద్దానంలో తక్షణం చేపట్టాల్సిన చర్యల గురించి మాట్లాడనున్నారు. హార్వర్డ్‌ వైద్యులు ఉద్దానంలో సమస్యకు మూలాలు తెలుసుకోవడంతోపాటు అక్కడ కిడ్నీ వ్యాధులకు సంబంధించిన పరిశోధన, వైద్యకేంద్రాలు ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ... డిప్యూటీ సీఎంగా మోడీ