Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హరికేన్ 'ఇర్మా'లో చిక్కుకున్న ఫ్లైట్ ... భయానక వీడియో

కరేబియన్ దీవులను హరికేన్ 'ఇర్మా' అతలాకుతలం చేస్తోంది. ఈ తుఫాను క్షణక్షణానికి ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ తుఫాను తీవ్రతను అంచనా వేసేందుకు ఓ ప్రత్యేక వాతావరణ పరిశీలక విమానాన్ని పంపించగా భయకంపితులను చేసే దృశ

Advertiesment
హరికేన్ 'ఇర్మా'లో చిక్కుకున్న ఫ్లైట్ ... భయానక వీడియో
, బుధవారం, 6 సెప్టెంబరు 2017 (15:48 IST)
కరేబియన్ దీవులను హరికేన్ 'ఇర్మా' అతలాకుతలం చేస్తోంది. ఈ తుఫాను క్షణక్షణానికి ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ తుఫాను తీవ్రతను అంచనా వేసేందుకు ఓ ప్రత్యేక వాతావరణ పరిశీలక విమానాన్ని పంపించగా భయకంపితులను చేసే దృశ్యాలు కనిపించాయి. 
 
నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్పెరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ వియానం ఎన్‌వోఏఏ42 విమానం సమర్థంగా అందులో ప్రయాణించి డేటాను, వీడియోలను పంపించింది. అది పంపించిన వివరాల ప్రకారం ఇర్మా గంటకు 295 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది.
 
ఫ్లోరిడా తీరానికి ఇది ఈ శనివారం చేరుకోనుంది. ఇప్పటికే అతలాకుతలం చేసి వెళ్లిన హార్వీ తుఫానుకంటే బలమైనదిగా ఇర్మాను వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
అందువల్ల దేశంలోని అన్ని తీర ప్రాంతాల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఇర్మాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఫ్లోరిడా, ఫ్యురిటో రికో, వర్జిన్‌ ఐలాండ్‌ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. 460 తుఫాను బాధిత ఆశ్రయాలు ఏర్పాటు చేశారు
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గణేషుడుతో గొర్రె మాంసం ప్రమోషన్‌ (Video)