Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుర్తు తెలియని బ్యాగ్ ఎవరు తెచ్చారు. వైట్‌హౌస్ గజగజ

2001లో అమెరికాపై అల్‌ఖైదా ఉగ్రదాడి జరిగిన తర్వాత వైట్ ‌‌హౌస్‌ను మూసివేసిన ఘటన ఇదే తొలిసారి. దీనంతటికీ కారణం ఒక గుర్తు తెలీని బ్యాగ్. వైట్ హౌస్ భవనంలో పనిచేసే సిబ్బంది దక్షిణం వైపున్న ప్రాంతంలో ఓ బ్యాగును గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. సీక్ర

గుర్తు తెలియని బ్యాగ్ ఎవరు తెచ్చారు. వైట్‌హౌస్ గజగజ
హైదరాబాద్ , బుధవారం, 29 మార్చి 2017 (02:47 IST)
అక్కడ నిజంగా భద్రత ఉందే లేదో తెలీదు కాని ప్రతినిత్యం ఏదో ఒక కలకలం రేగుతూనే ఉంటుంది. రెండు నెలలక్రితం శత్రుదుర్బేద్యంగా ఉండే ఆ ప్రాంతం ఆవరణలోకి ఒక అపరిచితుడు ఈజీగా ప్రవేశించాడు. అది మీడియాలో వచ్చాక భద్రతాధికారులు అలర్ట్ అయ్యారు. ఈసారి వంతు ప్రాణం లేని బ్యాగ్ తీసుకుంది. ఎవరు పెట్టారో తెలీదు. ఎలా  వచ్చిందో తెలీదు. ఎందరి కళ్లుగప్పి వచ్చిందో తెలీదు ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన స్థలంలో ఒక గుర్తు తెలియని బ్యాగ్. ఏదో జరుగుతోందని శంకించారు. మొత్తం భవంతినే మూసేశారు. 
 
రంగంలోకి దిగిన వారు  ఆ అనుమానిత బ్యాగుతో పాటు అధ్యక్ష భవనంలో అణువణువు క్షణ్ణంగా తనిఖీలు చేపట్టారు. 
 
గుర్తుతెలియని వ్యక్తులెవరైనా వైట్‌హౌస్‌లోకి చొరబడి ఉండొచ్చునని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. యూరప్‌లో దాడులు, వాహనాలు డీకొట్టి మరీ దాడులు. తుపాకులతో దాడులు. నిత్య కృత్యం అయిన నేపథ్యంలో అమెరికా చీమ చిటుక్కుమంటే భయపడుతోంది. 
 
బ్రిటన్ లోని లండన్ నగరంలో ఇటీవలే పార్లమెంట్ భవనాన్ని లక్ష్యంాగ చేసుకుని ఒక దుండుగుడు దాడికి పాల్పడిన నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు గజగజ వణికిపోతున్నాయి. ఉగ్రవాదులు ప్రకటనలు చేసి మరీ దాడులకు పాల్పడుతుండటంతో ఆయా దేశాల ప్రభుత్వాధినేతల భద్రతకు పెనుసవాలుగా మారింది. ఈ నేపథ్యంలో 
వైట్‌ హౌస్‌లో సిబ్బందికి తెలియకుండా అనుమానిత వస్తువు కనిపించడంతో కాస్త కలకలం రేగింది. భద్రతా సిబ్బంది పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గూగుల్ ట్రెండ్స్‌లో జగన్‌కే ఓటేశారు.. చంద్రబాబును పక్కనబెట్టారు.. మోడీ, రాహుల్, కేజ్రీకి తర్వాత?