గూగుల్ ట్రెండ్స్‌లో జగన్‌కే ఓటేశారు.. చంద్రబాబును పక్కనబెట్టారు.. మోడీ, రాహుల్, కేజ్రీకి తర్వాత?
ఇదేంటి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డే కదా ఓడిపోయారు. మరి జగన్‌కు ఓటేసి.. ఏపీ సీఎం చంద్రబాబును పక్కనబెట్టేశారా? ఇదెక్కడ అనుకుంటున్నారు.. కదూ.. అయితే చదవండి. ఏపీలో అత్యధిక మంది నెట
ఇదేంటి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డే కదా ఓడిపోయారు. మరి జగన్‌కు ఓటేసి.. ఏపీ సీఎం చంద్రబాబును పక్కనబెట్టేశారా? ఇదెక్కడ అనుకుంటున్నారు.. కదూ.. అయితే చదవండి. ఏపీలో అత్యధిక మంది నెటిజెన్లు సెర్చ్ చేసిన నేతగా వైఎస్ జగన్ టాప్‌లో నిలిచారు. ఇలా జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన నెటిజన్లు.. ముఖ్యమంత్రి చంద్రబాబును పక్కనబెట్టేశారు.
మరో విశేషమేంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో సమానంగా జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ ఉన్నట్లు గూగుల్ ట్రెండ్స్‌లో తేలిపోయింది. గడిచిన 90 రోజుల సెర్చ్ ఇంజిన్ సమాచారం అనుగుణంగా గూగూల్ ట్రెండ్స్‌లో జగనే అగ్రస్థానంలో నిలిచారు. తద్వారా జగన్ గురించి నెటిజన్లు అధిక సమాచారాన్ని సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది.
ఇకపోతే.. ఈ సెర్చ్ ఇంజిన్ సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల చంద్రులు, చంద్రబాబు, కేసీఆర్‌ల గురించి నెటిజెన్స్ అంతగా సెర్చ్ చేయడం లేదట. కాగా, మోడీ గురించి సెర్చ్ చేసినవాళ్లలో సగం మంది, కేజ్రీవాల్ గురించి సెర్చ్ చేసినవాళ్లలో మూడింట రెండొంతుల మంది ఏపీ నుంచి జగన్ కోసం సెర్చ్ చేశారని.. వైకాపా అధికారిక ఫేస్ బుక్ పేజీకి పది నెలల్లోనే మూడు లక్షలకు పైగా లైక్స్ వెల్లువెత్తాయి.