Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్నికల్లో ఓడిపోయినా... కమలా హారీస్ పోరాటం కొనసాగిస్తారు : జో బైడెన్

joe biden

ఠాగూర్

, గురువారం, 7 నవంబరు 2024 (11:02 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి కమలా హారీస్ అమెరికా ప్రజల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. తాజాగా వెల్లడైన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ చేతిలో కమలా హారీస్ ఓటమిపాలయ్యారు. ఈ ఫలితాలపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. 
 
కమలా హారిస్ తన పోరాటాన్ని కొనసాగిస్తారని తెలిపారు. అసాధారణ పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థిగా వచ్చి చరిత్రాత్మకమైన ప్రచారానికి నాయకత్వం వహించారని కొనియాడారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 
 
'ఈ రోజు అమెరికా చూసింది నాకు తెలిసిన కమలా హారీస్. ఆమె చాలా ధైర్యం నిండిన ప్రజా సేవకురాలు. అమెరికన్లందరికీ స్వేచ్ఛ, న్యాయం, మరిన్ని అవకాశాలు రావాలని బలంగా కోరుకున్నారు. 2020 ఎన్నికల్లో నేను అధ్యక్ష అభ్యర్థిగా ఉన్నప్పుడు హారీస్‌పై నమ్మకంతోనే ఉపాధ్యక్షురాలిగా ఎంచుకున్నాను. అది నేను తీసుకున్న ఉత్తమమైన నిర్ణయం. ఆమె కథ అమెరికాకు ఉత్తమమైనది. ఈరోజు ఆమె చెప్పినట్లు తన బాధ్యతను కొనసాగిస్తుందనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. హారిస్ సంకల్పంతో ఆనందంగా పోరాటాన్ని సాగిస్తుంది. అమెరికన్లందరికీ ఛాంపియన్‌గా నిలుస్తుంది. రానున్న తరాలకు మార్గదర్శిగా నిలుస్తారు' అని బైడెన్ రాసుకొచ్చారు.
 
ఇదిలాఉండగా.. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు బైడెన్ ఫోనులో అభినందనలు తెలిపారు. ఈమేరకు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది. 'అధ్యక్షుడు బైడెన్ సజావుగా పరివర్తనను నిర్ధరించడంలో తన నిబద్ధతను తెలియజేశారు. దేశాన్ని ఏకతాటి పైకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు' అని తెలిపింది. 
 
అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌నకు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా ఇది మేము ఆశించిన ఫలితం కాదని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 'ఇది మేము ఆశించిన ఫలితం కాదు. కానీ, ప్రజాస్వామ్యంలో జీవించడం అంటే ఎల్లప్పుడూ మనమే గెలవడం కాదు. అందుకే శాంతియుతంగా అధికార మార్పిడికి సిద్ధంగా ఉన్నాం' అని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం.. విగ్రహానికి క్షీరాభిషేకం.. సంబురాలు