Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైట్‌హౌస్‌లో కరోనా కలకలం : డోనాల్డ్ ట్రంప్‌కు వైరస్ భయం!!

Advertiesment
Robert O'Brien
, మంగళవారం, 28 జులై 2020 (07:23 IST)
అమెరికా అధ్యక్ష పరిపాలనా కేంద్రమైన వైట్‌హౌస్‌లోకి కరోనా వైరస్ ఎంటరైంది. ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న రాబర్ట్ ఓబ్రియాన్‌కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు నిర్వహించిన వైద్యపరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు వైట్‌హౌస్ కూడా అధికారికంగా ఓ ప్రకటన చేసింది.
 
ఓబ్రియన్ కు కరోనా నిర్ధారణ అయిందని, ఆయన ప్రస్తుతం ఐసోలేషన్ లోకి వెళ్లారని తెలిపింది. క్వారంటైన్‌లో ఉంటూ విధులు నిర్వర్తిస్తారని వెల్లడించింది. జాతీయ భద్రతా మండలి కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం ఉండదని స్పష్టం చేశాయి.
 
అమెరికా పాలన వ్యవహారాల్లోనూ, విదేశాంగ విధానంలోనూ కీలక పాత్ర పోషించే రాబర్ట్ ఓబ్రియన్ ఈ నెలలో పారిస్ వెళ్లి ఓ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఆయనకు ఎక్కడ కరోనా సోకిందన్న దానిపై స్పష్టతలేదు. 
 
జాతీయ భద్రతా సలహదారుకు కరోనా నిర్ధారణ అయిన నేపథ్యంలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు కరోనా ముప్పు లేదని వైట్‌హౌస్ స్పష్టం చేసింది.
 
కాగా, గతంలో కరోనా రాకుండా ముఖానికి మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు పదేపదే సూచించారు. కానీ, డోనాల్డ్ ట్రంప్ తేలిగ్గా తీసుకున్నారు. కానీ, ఇటీవల ఆయన మాట్లాడుతూ, ముఖానికి మాస్క్ ధరించడం దేశ భక్తిని చాటడమే అంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ రాష్ట్ర కొత్త రథసారథిగా సోము వీర్రాజు - కన్నాకు అందుకే చెక్ పెట్టారా?