Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్న డోనాల్డ్ ట్రంప్

Advertiesment
వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్న డోనాల్డ్ ట్రంప్
, మంగళవారం, 14 జనవరి 2020 (13:05 IST)
అగ్రరాజ్యం అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా దౌర్య వర్గాలు వెల్లడించాయి. వాషింగ్టన్ నుంచి వచ్చే సెక్యూరిటీ అండ్ లాజిస్టిక్ టీమ్స్ వచ్చే వారంలో ఇండియాకు వచ్చి, ట్రంప్ పర్యటనకు ఏర్పాట్లను పరిశీలించనున్నట్టు తెలిపాయి.
 
వాస్తవానికి డోనాల్డ్ ట్రంప్ పర్యటనకు సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. కాగా, ఈ సంవత్సరం రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరగా, ట్రంప్ సున్నితంగా తిరస్కరించారన్న సంగతి తెలిసిందే.
 
ఇదే సమయంలో తాను మరోమారు భారత్‌కు వస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని జనవరి 7న జరిగిన ఫోన్ సంభాషణల్లో మోడీ ప్రస్తావించినట్టు సమాచారం. ఆ వెంటనే ట్రంప్ భారత పర్యటనకు ఏర్పాట్లు చేయాలని సూచించినట్టు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి చివరి వారంలో ఈ పర్యటన ఉండవచ్చని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షి ష్రింగ్లా వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు... చెన్నైలో బోగి మంటలు వేసిన ఉపరాష్ట్రపతి