Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లక్షణాలు లేని కరోనా కేసులు.. 380 కేసులు చైనాలో నమోదు

Advertiesment
లక్షణాలు లేని కరోనా కేసులు.. 380 కేసులు చైనాలో నమోదు
, శనివారం, 9 మే 2020 (12:33 IST)
కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకీ పెరిగిపోతుంది. వూహాన్ నగరం సహా హుబే ప్రావిన్స్‌లో ప్రస్తుతం కరోనా తన ప్రతాపం చూపించే అవకాశం వుందని తెలుస్తోంది. తాజాగా ఓ షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. తాజాగా నమోదైన కరోనా కేసులన్నీ ఎలాంటి లక్షణాలు లేకుండానే నమోదవుతున్నాయి. 
 
హుబే ప్రావిన్స్‌లో 380 కేసులు ఇప్పటివరకు నమోదు కాగా.. అందులో 377 కేసుల్లో ఒక్క లక్షణం కూడా బయటపడలేదు.  ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఆందోళనకరంగా ఉందని నిపుణులు అంటున్నారు. లాక్ డౌన్‌ని ఎత్తివేయడంతో జనాలు అందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చేశారు. 
 
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. దాదాపు 212 దేశాలకు ఈ వైరస్ పాకింది. ఇప్పటి ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ కొనసాగిస్తున్నప్పటికీ.. మహమ్మారి విస్తరణకు అడ్డుకట్టవేయడం కుదరడం లేదు. తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 40,14,265కు చేరింది. వీరిలో 2,70,740 చనిపోగా..1,387,181 కోలుకున్నారు.
 
అటు అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు పెరుగుతూ 13 లక్షలను దాటేసింది. ఆ దేశంలో 1,322,163 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 78,616 మంది మృత్యువాత పడ్డాయి. ఇక లక్ష కరోనా కేసులు దాటిన దేశాల లిస్ట్‌లో స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, టర్కీ, బ్రెజిల్ దేశాలు ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏడాదిన్నర బాబుకూ కరోనా వైరస్‌.. ఒకే రోజు రంగారెడ్డిలో..?