జపాన్‌లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఇదే ప్రపంచ చివరి యుద్ధం అని భారీ విధ్వంసాలు చోటుచేసుకున్నాయి. ప్రాణనష్టం భారీగా వున్నది. ఆ సమయంలో జపాన్ సైన్యం ఆసియా దేశాలకు చెందిన లక్షలాది మంది మహిళలను లైంగిక బానిసలుగా వేధించినట్లు తాజా నివేదికలో తేలింది.
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో 1942వ సంవత్సరం.. లీ అనే యువతి ఉద్యోగం ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా జపాన్ సైనికులు ఆ యువతిని కిడ్నాప్ చేశారు. ఆపై ఆమెను చైనాకు పంపించారు. అక్కడ ఆమెను లైంగిక బానిసగా చిత్రహింసలకు గురిచేశారు.
ఇదే విధంగా లక్షలాది మహిళలు రెండో ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో లైంగిక బానిసలుగా మగ్గారని తెలిసింది. ఇలా సెక్స్ బానిసలుగా మారిన మహిళల సంఖ్య నాలుగు లక్షలుగా వుంటుందని పరిశోధనలో తేలింది. ప్రస్తుతం తాజా నివేదిక జపాన్‌లో సంచలనానికి దారి తీసింది.