తాలిబన్ల దుశ్చర్యలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇప్పటికే జానపద గాయకుడిని హత్య చేసిన సంగతి తెలిసిందే. అలాగే గతంలో తొలి మహిళా గవర్నర్లలో ఒకరైన సలీమా మజారీని తాలిబన్లు అదుపులోకి తీసుకున్నారు.
అఫ్గాన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రిలీజియస్ స్కాలర్స్ మాజీ అధిపతి మౌల్వీ మొహమ్మద్ సర్దార్ జాద్రాన్ను అరెస్టు చేశామని తాలిబన్లు ధ్రువీకరించారు.
మొహమ్మద్ మౌల్వీ కళ్లకు గంతలు కట్టి ఉన్న సర్దార్ జద్రాన్ ఫొటోను తాలిబన్లు విడుదల చేశారు. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.