Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆత్మాహుతి బాంబర్‌గా మారిన మాజీ ఎంపీ... ఎందుకు?

సోమాలియా దేశంలో ఓ మాజీ ఎంపీ ఆత్మాహుతి బాంబర్‌గా మారాడు. ఫలితంగా 13 మంది ప్రాణాలు తీశాడు. ఈ దారుణం ఆఫ్రికా దేశమైన సోమాలియాలో జరిగింది.

Advertiesment
Suicide Bomber
, బుధవారం, 27 జులై 2016 (16:59 IST)
సోమాలియా దేశంలో ఓ మాజీ ఎంపీ ఆత్మాహుతి బాంబర్‌గా మారాడు. ఫలితంగా 13 మంది ప్రాణాలు తీశాడు. ఈ దారుణం ఆఫ్రికా దేశమైన సోమాలియాలో జరిగింది. సోమాలియా రాజధాని మొగదిషు విమానాశ్రయంలో జంట ఆత్మాహుతి దాడులు జరిగి 13 మంది మరణించిన విషయం తెలిసిందే. 
 
ఆ దాడులు చేసిన ఆత్మాహుతి బాంబర్లలో ఒక మాజీ ఎంపీ కూడా ఉన్నట్లు తేలింది. 2004 నుంచి 2010 వరకు సోమాలియా పార్లమెంటులో సభ్యుడిగా పనిచేసిన సలా బాడ్బాడో (53) ఆ తర్వాత వెంటనే అల్ షబాబ్ అనే ఉగ్రవాద సంస్థలో చేరారు. సోమాలియాలోని అల్ ఖైదా అనుంధ సంస్థలో చేరేందుకు తాను రాజకీయాలకు గుడ్బై చెబుతున్నట్లు ఆయన అప్పట్లో ఆయన ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పారు.
 
మంగళవారం నాటి ఇద్దరు బాంబర్లలో ఆయనొకరని అల్ షబాబ్ ఉగ్రవాదులు ప్రకటించారు. తమ ఇద్దరు యోధుల్లో సలా బడ్బాడో ఒకరని, హలేన్ మిలటరీ బేస్ మీద జరిగిన దాడుల్లో ఆయన కూడా పాల్గొన్నారని టెలిగ్రామ్ యాప్ ద్వారాను, అండాలస్ రేడియో స్టేషన్ ద్వారాన విడుదల చేసిన ప్రకటనల్లో వెల్లడించారు. 
 
మరోవైపు.. సిరియాలో మరోమారు బాంబుల మోతమోగింది. కుర్దులు పెద్ద సంఖ్యలో ఉండే ఖమిష్లి నగరంలో బాంబు దాడులు జరిగాయి. ఘటనలో 44 మంది మృత్యువాతపడ్డారు. మరో 150 మంది గాయపడ్డారు. 
 
క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాంబుదాడులకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. ఆత్మాహుతి దాడులని ప్రాథమికంగా సమాచారం అందింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కూతురు కోసం పక్కింటి అబ్బాయికి 'ప్లగ్' పెట్టిన ఆంటీ... ఏం చేసింది?