ఆఫ్రికాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను పొట్టేలు దాడి చేసింది. దీంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆ గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష పడింది.
వివరాల్లోకి వెళితే.. ఆఫ్రికా, సౌత్, మాన్యాంగ్ ధాల్ లో ఈ సంఘటన జరిగింది. అకుల్ యోల్ ప్రాంతంలో.. ఆదియు చాంపింగ్ (45) అనే మహిళపై, ఒక గొర్రె దాడిచేసింది. ఆమెను వెంటనే స్థానికులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమెను చూసిన డాక్టర్లు ఆమె పక్కటెముకలు విరిగిపోయాయని, అప్పటికే చనిపోయిందని తెలిపారు. దీంతో బాధిత తరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సదరు గొర్రె .. రామ్ అనే వ్యక్తిది. మరణించిన మహిళ.. వీరికి సమీప బంధువుకూడా. ఈ ఘటనపై కోర్టు వింత తీర్పు ఇచ్చింది. ఈ ఘటనకు కారణమైన గొర్రెకు మూడేళ్ల పాటు జైలు శిక్షను విధించారు. అదే విధంగా, గొర్రె యజమానిని నిర్దోషి అని తేల్చింది.
అయితే, మరణించిన మహిళ కుటుంబానికి , ఐదు ఆవులను పరిహరంగా ఇవ్వాలని గొర్రె యజమానికి కోర్టు ఆదేశించింది. ఇక శిక్ష కాలంలో, గొర్రె సౌత్ సుడాలన్‌లోని లేక్ స్టేట్ లోని ఆడ్యూల్ కౌంటి సైనిక శిబిరంలో గొర్రె మూడేళ్ల పాటు ఉంటుందని తీర్పు వెలువరించింది.