Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసోలేషన్‌లోకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌

ఐసోలేషన్‌లోకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌
, మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (18:06 IST)
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లనున్నారని క్రెమ్లిన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. క్రెమ్లిన్‌లో ఉన్న సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్‌ సంక్రమించడమే ఇందుకు కారణమని తెలిపారు. 
 
స్వీయ నిర్బంధంలోకి వెళ్ళినప్పటికీ వీడియో లింకుల ద్వారా ఆయన సమావేశాలకు హాజరకానున్నట్లు క్రెమ్లిన్‌ ప్రకటనలో తెలిపింది. ప్రధాన మీటింగ్‌లన్నీ ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించనున్నారు. జర్నలిస్టుల కోసం ఇవాళ ఈ ప్రకటన రిలీజ్‌ చేశారు. 
 
కాగా కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతూనే ఉంది.. కాస్త తగ్గుముఖం పట్టినా.. ఇంకా పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తగిలింది.. క్రెమ్లిన్‌లో ఉన్న సిబ్బందిలో ఒక‌రికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలంది.. దీంతో పుతిన్‌ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లేందుకు సిద్ధమైనట్టు రష్యన్‌ మీడియా పేర్కొంటోంది.
 
ఇక, కోవిడ్‌ దెబ్బతో అంతా ఆల్‌లైన్‌ మయం కాగా.. ఇప్పుడు పుతిన్‌ కూడా వీడియో లింకుల ద్వారా ఆయ‌న స‌మావేశాల్లో పాల్గొంటారని క్రెమ్లిన్ ప్రకటించింది.. ప్రధాన మీటింగ్‌ల‌న్నీ ఆన్‌లైన్ ద్వారా జరగనున్నాయి.
 
ఇక, త‌జ‌క్ నేత ఎమ్మోమ‌లి రెహ‌మాన్‌తో జ‌రిగిన ఫోన్ సంభాష‌ణ‌లో పుతిన్ మాట్లాడుతూ.. తాను ఉంటున్న ప్రదేశంలో క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదు అయ్యాయని.. దీంతో.. కొన్ని రోజుల పాటు నేను సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉంటున్నట్టు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వార్దా నదిలో బోల్తాపడిన పడవ - 11 మంది గల్లంతు