Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐరోపా దేశాలను గ్యాస్ పైప్ లైన్‌తో కొడుతున్న పుతిన్, బిత్తరపోతున్న దేశాలు

Advertiesment
ఐరోపా దేశాలను గ్యాస్ పైప్ లైన్‌తో కొడుతున్న పుతిన్, బిత్తరపోతున్న దేశాలు
, మంగళవారం, 8 మార్చి 2022 (19:32 IST)
ఉక్రెయిన్ పైన దాడి చేస్తూ మెల్లమెల్లగా ఆక్రమణ చేస్తున్న రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. దీనిపై రష్యా తీవ్ర హెచ్చరికలు చేసింది. ఇలాగే ఆంక్షలు వేసుకుంటూ వెళితే తాము తీసుకునే నిర్ణయానికి మీ దేశాల్లో కల్లోలం జరుగుతుందని హెచ్చరించింది. 

 
రష్యా నుంచి జర్మనీకి వెళుతున్న ఒక ప్రధాన గ్యాస్ పైప్‌లైన్‌ను మూసివేస్తామని బెదిరించింది. పశ్చిమ దేశాలు దాని ఇంధన ఎగుమతులపై నిషేధంతో ముందుకు వెళితే తాము తీసుకునే నిర్ణయంతో ముడి చమురు ధర బ్యారెల్ ఒక్కింటికి $300 చేరుతుందని హెచ్చరించింది.
 
 
రష్యన్ చమురును తిరస్కరిస్తే ప్రపంచ మార్కెట్‌కు ఇది విపత్కర పరిణామాలకు కారణమవుతుందని రష్యా ఉప ప్రధాన మంత్రి అలెగ్జాండర్ నోవాక్ సోమవారం తెలిపారు. గత నెలలో అత్యంత వివాదాస్పదమైన నార్డ్ స్ట్రీమ్ 2 గ్యాస్ పైప్‌లైన్ సర్టిఫికేషన్‌ను నిలిపివేస్తూ జర్మనీ తీసుకున్న నిర్ణయాన్ని ఉదహరిస్తూ నోవాక్... నార్డ్ స్ట్రీమ్ 1 గ్యాస్ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ పంపింగ్‌పై ఆంక్షలు విధించడానికి మాకు పూర్తి హక్కు ఉంది. ఐతే ఇప్పటివరకు, మేము అలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ యూరోపియన్ పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తుంటే తమను బలవంతంగా ఆ నిర్ణయం తీసుకునేట్లుగా వుందని వ్యాఖ్యానించారు.
 
 
రష్యా చమురు, వాయువుపై నిషేధం నిర్ణయం ఇంధన మార్కెట్లు- ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రకంపనలకు దారితీసే అవకాశం వుందని ఇంధన విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రష్యా దేశం అమెరికా, సౌదీ అరేబియా తర్వాత ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉంది.

 
ప్రపంచ మార్కెట్‌లకు ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురును ఎగుమతి చేసే దేశం అది. ఇది సహజ వాయువు యొక్క ప్రధాన ఉత్పత్తిదారు మాత్రమే కాదు ఎగుమతిదారు కూడా. యూరోపియన్ యూనియన్ దాని గ్యాస్‌లో దాదాపు 40% రష్యన్ పైప్‌లైన్‌ల ద్వారా పొందుతుంది, వీటిలో చాలా వరకు ఉక్రెయిన్ ద్వారా నడుస్తాయి. ఈ పరిస్థితుల్లో ఐరోపా దేశాలు నోరు మెదిపే పరిస్థితి లేకుండా పుతిన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దళిత బంధు ఒక బోగస్ - ఈటెల ఫైర్