Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తల్లే కూతురి పాలిట శాపమైంది.. డబ్బు కోసం కూతురిని వ్యభిచారం కూపంలోకి దించేసింది..

తల్లే కూతురి పాలిట శాపంగా మారింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కూతురి జీవితాన్ని నాశనం చేసింది. డబ్బు కోసం కూతురిని వ్యభిచారం కూపంలోకి దింపింది. ఈ దారుణం ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లోని గోల్డ్ కోస్ట

Advertiesment
తల్లే కూతురి పాలిట శాపమైంది.. డబ్బు కోసం కూతురిని వ్యభిచారం కూపంలోకి దించేసింది..
, సోమవారం, 5 సెప్టెంబరు 2016 (13:32 IST)
తల్లే కూతురి పాలిట శాపంగా మారింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కూతురి జీవితాన్ని నాశనం చేసింది. డబ్బు కోసం కూతురిని వ్యభిచారం కూపంలోకి దింపింది. ఈ దారుణం ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లోని గోల్డ్ కోస్ట్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కూతురిని బలవంతంగా వ్యభిచారవృత్తిలోకి దించి ఆమె జీవితాన్ని నాశనం చేసేందుకు తల్లి ప్రయత్నించింది.
 
 ఆ వివరాలను పరిశీలిస్తే...ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లోని గోల్డ్ కోస్ట్‌‌కు చెందిన ఓ37ఏళ్ల తల్లి తన తొమ్మిదేళ్ల కూతుర్ని బలవంతంగా వ్యభిచార‌ంలోకి దింపింది. తన కూతురికి మగవాళ్ల ధరించే బట్టలు తొడిగించి తన 'స్నేహితులతో' పంపి ఆమె ఆ ఘాతుకానికి పాల్పడినట్లు డైలీ మెయిల్ వెల్లడించింది. బాలికకు కౌన్సిలింగ్ నిర్వహించిన సైకాలజిస్టు, పోలీసుల కథనం ప్రకారం...చిన్నారిపై ఆమె తల్లి స్నేహితులు మే 2014 నుంచి మే 2015 మధ్యలో అనేకసార్లు అత్యాచారం చేసినట్లు వెల్లడైంది. 
 
దీనికితోడు తనతో తన తల్లి బలవంతంగా పలుమార్లు మద్యం సేవించి ఒత్తిడి తెచ్చిందని బాలిక తెలిపింది. మత్తు పదార్థాలిచ్చి ఒక కామాంధుడు తనతో ఓరాల్ సెక్స్‌లో పాల్గొన్నాడని అమ్మాయి పోలీసులకు వివరించింది. ఒకసారి ఇద్దరుముగ్గురు వ్యక్తులు తన కలిసి కాళ్లు చేతులు కట్టేసి తనతో అత్యాచారానికి పాల్పడ్డారని.... ఎదురు తిరిగితే చంపేస్తామని బెదిరించేవారని కన్నీరుమున్నీరైంది. ఇప్పటికే అరెస్టయి జైల్లో ఉన్న తల్లి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆ పత్రిక వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోషల్ మీడియాలో వేధింపులు.. మనస్తాపంతో గాయని ఆత్మహత్యాయత్నం