Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోషల్ మీడియాలో వేధింపులు.. మనస్తాపంతో గాయని ఆత్మహత్యాయత్నం

సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు క్రేజ్ కోసం పోస్టులు చేస్తుండటం మామూలే. అయితే తనను నెటిజన్లు సోషల్ మీడియాలో వేధిస్తున్నారని ఓ గాయని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

Advertiesment
సోషల్ మీడియాలో వేధింపులు.. మనస్తాపంతో గాయని ఆత్మహత్యాయత్నం
, సోమవారం, 5 సెప్టెంబరు 2016 (12:14 IST)
సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు క్రేజ్ కోసం పోస్టులు చేస్తుండటం మామూలే. అయితే తనను నెటిజన్లు సోషల్ మీడియాలో వేధిస్తున్నారని ఓ గాయని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. హర్యానాకు చెందిన ఓ గాయని ఢిల్లీలోని తన నివాసంలో ఎలుకల మందు తిని ఆత్మహత్యా యత్నం చేసింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. 
 
వివరాల్లోకి వెళితే.. గుర్గామ్‌కు చెందిన ఓ నివాసి తనను సోషల్ మీడియాలో కించపరినందుకే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గాయకురాలు రాసిన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో గాయకురాలిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఆత్మహత్య ప్రేరేపణ కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు.. సోషల్ మీడియాలో సెలెబ్రిటీల ఫోటోలు.. ఆలయాల్లో రద్దీ..!