Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియురాలు ఆలస్యంగా వచ్చిందని… కుక్కపై అత్యాచారం చేశాడు..

Advertiesment
ప్రియురాలు ఆలస్యంగా వచ్చిందని… కుక్కపై అత్యాచారం చేశాడు..
, సోమవారం, 18 మార్చి 2019 (17:09 IST)
ప్రియురాలు త్వరగా ఇంటికి రాలేదని ఓ దుర్మార్గుడు ఆమె ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కపై అకృత్యాన్ని ప్రదర్శించాడు. వివరాల్లోకి వెళితే, 19 ఏళ్ల లారెన్స్ గ్రహామ్ అనే యువకుడు అమెరికా దేశం ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీలో ఉంటున్నాడు. అతడు స్థానిక స్కూల్‌లో ఫ్రీలాన్సింగ్ ఎంప్లాయ్‌గా పని చేస్తున్నాడు. అతనికి ఓ గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉంది. ఆమె ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. 
 
అయితే వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. ఆమె వృత్తిరీత్యా రోజు ఇంటికి ఆలస్యంగా వచ్చేది, దీంతో లారెన్స్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెను ఇంటికి త్వరగా రమ్మని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె ఆలస్యంగా వస్తోంది. అనుమానం కాస్త పెనుభూతంలా తయారైంది. రోజు రాత్రి 10:30 గంటలకల్లా ఇంటికి రాకపోతే ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న నీ కుక్కను చంపేస్తానని తీవ్ర హెచ్చరికలు చేసాడు.
 
ఈ విషయంలో ఇద్దరికీ మధ్య గొడవలు జరిగాయి. అతని వికృత చేష్టలకు భయపడి సదరు యువతి రోజు హడావుడిగా ఇంటికి వచ్చేది. ఇటీవల అతడు చెప్పిన సమయానికే ఇంటికి చేరుకున్నా.. ఆమె పెంపుడు కుక్క చనిపోయి కనిపించింది. ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క ప్రాణాలు తీసిన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. 
 
ఆ కుక్క ప్రాణాలు తీసేముందు దానిపై తీవ్రంగా అత్యాచారం జరిపినట్టు విచారణలో తేలింది. అత్యాచారం తరువాత బెల్టుతో ఉరివేసి చంపినట్టు పోలీసులు గుర్తించారు. కాగా లారెన్స్ మానసిక పరిస్థితి బాగోలేదని వారు తేల్చారు. ఈ వికృత చర్యకు పాల్పడిన లారెన్స్‌కు దాదాపు 15 వేల డాలర్ల (దాదాపు రూ.10 లక్షలకు పైగా) జరిమానాతో పాటు జైలుశిక్ష పడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ ఇంట్లో బీఎస్‌ఎన్‌ఎల్ లాండ్‌లైన్ వుందా? రోజుకి 5జిబి డేటా ఫ్రీ...