Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాశ్మీర్ ఇష్యూ.. పాక్ వైపు నుంచే పుట్టుకొస్తున్న ఆందోళనలు.. అమెరికా ఫైర్

కాశ్మీర్ అంశంపై అగ్రరాజ్యం అమెరికా తన వైఖరి మారబోదంటూ పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చింది. కాశ్మీర్‌పై జరిగే ఏ చర్చలకైనా కాశ్మీర్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జరపాలని అమెరికా స్పష్టం చేసింది. అంతేగాకుండా ఇ

Advertiesment
కాశ్మీర్ ఇష్యూ.. పాక్ వైపు నుంచే పుట్టుకొస్తున్న ఆందోళనలు.. అమెరికా ఫైర్
, గురువారం, 1 సెప్టెంబరు 2016 (17:44 IST)
కాశ్మీర్ అంశంపై అగ్రరాజ్యం అమెరికా తన వైఖరి మారబోదంటూ పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చింది. కాశ్మీర్‌పై జరిగే ఏ చర్చలకైనా కాశ్మీర్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జరపాలని అమెరికా స్పష్టం చేసింది. అంతేగాకుండా ఇరు దేశాలు వాస్తవాధీన రేఖను గౌరవించాలని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్, గిల్గిత్ బాల్టిస్థాన్ భూభాగాల్లో స్వాతంత్ర్యం కోసం పాకిస్థాన్ నుంచే పుట్టుకొస్తున్నట్లు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార వర్గాలు వెల్లడించాయి. 
 
పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిత్, బాల్టిస్థాన్ భూభాగాలపై అమెరికా స్పందిస్తూ.. కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తి లబ్ధి పొందాలనుకుంటున్న పాకిస్థాన్‌పై ఫైర్ అయ్యింది.  భారత్, పాక్ సంబంధాలు మరింత మెరుగుపడేందుకు అవసరమైన అన్ని చర్యలకు తాము మద్దతు ఇస్తామని అమెరికా పేర్కొంది.
 
అక్టోబర్ 15 నుంచి భారతీయ సంఘటనలకు సంబంధించిన విశేషాలను మోతాదుకు మించి తమ దేశ టెలివిజన్లలో ప్రసారం చేయకూడదని పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా అథారిటీ (పీఈఎంఆర్ఏ) నిర్ణయించింది. పాకిస్థాన్‌లో భారతీయ ఛానళ్లపై కూడా నియంత్రణ కొనసాగుతోందని పీఈఎంఆర్ఏ తీర్మానించింది. పాకిస్థాన్‌లో ఉన్న దాదాపు 30 లక్షల డీటీహెచ్ కనెక్షన్లను తొలగించాలని పీఈఎంఆర్ఏ వివరించింది. బలోచిలో ఎఐఆర్ ప్రోగ్రామ్‌లను కూడా రద్దు చేసేందుకు ఆ దేశ కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆనాడు 'అన్న'గా జేజేలు అందుకున్న ఎన్టీఆర్... ఈనాడు 'తమ్ముడు'గా ఆశీర్వాదాలందుకుంటున్న పవన్...