Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

OpenAI నుంచి ఎలెన్ మస్క్ తప్పుకోవడానికి కారణం ఏంటి?

Advertiesment
elon musk

సెల్వి

, బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (11:45 IST)
చాట్‌బాట్ సేవలను అందిస్తున్న చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐను 2015లో స్థాపించిన సమయంలో శామ్ ఆల్ట్‌మన్‌తో పాటు ఎలాన్ మస్క్ కూడా అందులో సభ్యుడిగా వున్నారు. అయితే 2018లో టెస్లా అధినేత ఆ పదవి నుంచి బయటకు వచ్చారు.
 
సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల కోసం ఏఐను అభివృద్ధి చేస్తున్న కారణంగా పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్నాయని తెలిపారు. ఇందుకు కృత్రిమ మేధస్సు విషయంలో ఇద్దరి మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలే అందుకు కారణమయ్యాయని తెలిపారు. 
 
ఏఐ విషయంలో ఇద్దరివీ భిన్నమైన అభిప్రాయాలు. గూగుల్‌లో వున్న ఏఐ నిపుణుడు ఇల్యా సట్‌‌స్కీవర్ ఓపెన్ ఏఐలోకి తీసుకోవడం పేజ్ ఆగ్రహానికి కారణమైందన్నారు. తనను మోసం చేసినట్లు భావించాడని మస్క్ తెలిపారు. ఏఐ భద్రత విషయంలో ఎలాంటి పట్టింపు లేకుండా వ్యవహరిస్తుండటం వల్లే తాను ఆ నియామకం చేపట్టినట్లు వెల్లడించారు. 
 
అయితే ఎలెన్ మస్క్ ఓపెన్ ఏఐ నుంచి తప్పుకోవడానికే వేరొక కారణం వుంది. ఓపెన్ ఏఐను మస్క్ స్వాధీనం చేసుకోవాలని అనుకున్నారని, అందుకు బోర్డు తిరస్కరించడంతో ఆయన బయటకు వెళ్లిపోయారని ఆల్ట్‌మన్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మృతురాలి కుటుంబానికి రూ.9 కోట్లు చెల్లించాలి : ఏపీఎస్ ఆర్టీసీకి సుప్రీం ఆదేశం