Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తర కొరియా అధ్యక్షుడి హెల్త్ కండిషన్ క్రిటికల్‌గా ఉందా?

ఉత్తర కొరియా అధ్యక్షుడి హెల్త్ కండిషన్ క్రిటికల్‌గా ఉందా?
, మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (09:54 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యం బాగా క్షీణించినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తా కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈ వార్తలు ఆ దేశ ప్రజలను ఒక్కసారి భయభ్రాంతులకు గురిచేశాయి. ఈ వార్తలు ఉత్తర కొరియా మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా, నార్త్ కొరియా కరెన్సీ వాన్ డాలర్‌తో మారకవు విలువలో భారీగా పడిపోయిది. ఫలితంగా ఆ దేశ మార్కెట్ కుదేలైంది. 
 
కాగా, కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సీఎన్ఎన్ వార్తా సంస్థ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపింది. గుండెకు సర్జరీ అనంతరం తీవ్ర అనారోగ్య సమస్యతో ఆయన బాధపడుతున్నారన్న వార్త మినహా మరే విధమైన ఇతర వివరాలు వెల్లడికాలేదు. 
 
కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలతో భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో నార్త్ కొరియా కరెన్సీ 'వాన్' డాలరుతో మారకపు విలువలో భారీగా పడిపోయింది. 
 
డాలరుతో విలువ 1,239.35 వాన్‌లకు చేరింది. ఇదేసమయంలో దేశ స్టాక్ మార్కెట్ సూచిక కోస్పీ, 2.62 శాతం పడిపోయింది. కోస్ డాక్ ఇండెక్స్ 3.47 శాతం దిగజారింది. కొరియా రక్షణ సంస్థ విక్టెక్ ఈక్విటీ ధర మాత్రం సుమారు 30 శాతం పెరిగింది.
 
ఇదిలావుండగా, చాలా వార్తా సంస్థలు కిమ్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ఆచితూచి స్పందిస్తున్నాయి. గుండెకు శస్త్రచికిత్స అనంతరం కి‌మ్‌కు ట్రీట్మెంట్ జరుగుతోందని 'రాయిటర్స్' వార్తా సంస్థ ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మక్కా మసీదు మూసివేతకు నిర్ణయం?