మోడీ చెప్పినట్లు తలూపుతున్న నవాజ్ షరీఫ్.. ఇమ్రాన్ ఖాన్ ఫైర్
పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సఫ్ పార్టీ ఛైర్మన్ ఇమ్రాన్‌ఖాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్లు
పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సఫ్ పార్టీ ఛైర్మన్ ఇమ్రాన్‌ఖాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్లు నవాజ్ షరీఫ్ నడుచుకుంటున్నారని విమర్శించారు. నవాజ్ షరీఫ్ శస్త్రచికిత్స నిమిత్తం లండన్ వెళ్లినప్పుడు తన తల్లి, బిడ్డలకు మొదటి ఫోన్ చేయకుండా భారత ప్రధాని మోడీకి చేశారని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. పాకిస్థాన్‌లో మోడీ అభిరుచులకు అనుగుణంగా పాలన సాగుతోందని దుయ్యబట్టారు.
ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్ పార్టీ తలపెట్టిన భారీ ర్యాలీని ప్రభుత్వం ఉక్కుపాదాలతో అణిచేసి, వందమందికి పైగా అనుచరులను అరెస్టుచేయడంపై ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేశారు. సమాచార శాఖ మంత్రి పర్వేజ్ రషీద్‌పై వేటు వేశారు గానీ, అత్యంత రహస్య సమాచారాన్ని ఆయన తనంతట తానుగా మీడియాకు లీక్ చేయలేరని, నవాజ్ చెబితేనే చేశారన్న విషయం అందరికీ తెలుసునని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.