Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపావళి ఎఫెక్ట్: ఢిల్లీలో కాలుష్య మేఘాలు.. పాఠశాలలు, కార్యాలయాలు మూతపడతాయా?

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. కాలుష్య మేఘాలు కమ్ముకున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ ప్రజలు పెద్దఎత్తున టపాసులు కాల్చడంతో సోమవారం ఢిల్లీని కాలుష్యంతో కూడిన పొగమంచు

Advertiesment
దీపావళి ఎఫెక్ట్: ఢిల్లీలో కాలుష్య మేఘాలు.. పాఠశాలలు, కార్యాలయాలు మూతపడతాయా?
, సోమవారం, 31 అక్టోబరు 2016 (10:41 IST)
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. కాలుష్య మేఘాలు కమ్ముకున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ ప్రజలు పెద్దఎత్తున టపాసులు కాల్చడంతో సోమవారం ఢిల్లీని కాలుష్యంతో కూడిన పొగమంచు అలముకుంది.
 
ఢిల్లీ నగరంలో ఒక్క రాత్రికే గాలి కాలుష్యం 42 శాతం పెరిగిపోవడంతో సోమవారం ఉదయాన్నే తమ కార్యాలయాలకు వెళ్లాల్సిన ప్రజలకు కాలుష్యంతో కూడిన పొగమంచు దుప్పటిలా కప్పబడటం వల్ల రోడ్లపై వచ్చే వారు కూడా సరిగా కనిపించలేదు. పశ్చిమ ఢిల్లీలో గాలి కలుషితమై ఆందోళనకరంగా మారింది. ఇదే కాలుష్యం మరో మూడు రోజులు కొనసాగితే, పాఠశాలలు, కార్యాలయాలు మూతపడతాయి. 
 
దేశరాజధానిలోనే కాలుష్యం స్థాయి ఇంతగా పెరగడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ గణాంకాల ప్రకారం ఆర్కేపురం వద్ద గాలిలో కాలుష్యం సాధారణం కంటే 42 రెట్లు పెరిగింది. ప్రపంచ అతి పెద్ద నగరాల్లో ఒకటైన ఢిల్లీని సోమవారం కాలుష్యం దుప్పటిలా కప్పిందని పలువురు ఢిల్లీ వాసులు ట్విట్టర్‌లో పెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సవతి తల్లి దాష్టీకం.. నాలుగేళ్ల చిన్నారికి వాతలు పెట్టిన వైనం.. తీవ్ర రక్తస్రావం కావడంతో?