ప్రపంచ దేశాల్లో జనాభా పెరిగిపోతుందని తలను పట్టుకుంటున్న తరుణంలో ఓ జంట 16వ సంతానానికి తల్లిదండ్రులు కానున్నారు. ఇప్పటికే 15మంది కలిగిన ఆ జంట త్వరలోనే 16వ సంతానాన్ని కూడా సాదరంగా ఆహ్వానించనుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని నార్త్ కరోలినాలోని షార్లెట్‌కు చెందిన కార్లోస్ హెర్నాండెజ్, ప్యాటీ హెర్నాండెజ్ దంపతులకు ఇప్పటికే 15 మంది పిల్లలున్నారు.
ప్యాటీ ఇప్పటికే మూడుసార్లు కవలలకు జన్మనిచ్చింది. వీరందరినీ చూసుకుంటూనే మరోసారి గర్భం దాల్చింది. అయితే 16వ బిడ్డను కూడా కంటావా అని అడిగితే దేవుడు ఇచ్చిన వరాన్ని వదులుకోకూడదు. భగవంతుడు ఏది ఇస్తే అది తీసుకుంటామని చెబుతుంది ప్యాటీ.
భారత్‌లో ఒకరిద్దని పెంచేందుకే మల్లగుల్లాలు పడుతున్న తల్లిదండ్రులు ఎందరో వుండగా.. అమెరికాలో ఈ జంట ఇప్పటికే 15మంది పిల్లలను పెంచుతూ.. 16వ బిడ్డను కూడా కనేందుకు సిద్ధమని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.