Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీలంకలో దిగజారిన పరిస్థితులు - కుటుంబ పోషణ కోసం వేశ్యలుగా మహిళలు

Advertiesment
prostitute
, గురువారం, 21 జులై 2022 (16:55 IST)
శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ మరింత అధ్వాన్నంగా దిగిజారిపోతున్నాయి. దీంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా, శ్రీలంక దేశం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో చిక్కుకునిపోయింది. దీంతో ప్రజల జీవన ప్రయాణం కూడా మరింత దుర్భలంగా మారింది. ఈ క్రమంలో శ్రీలంక మహిళలు కుటుంబ పోషణ నిమిత్తం వ్యభిచారం చేస్తున్నారు. ఇలాంటి వారిని పోలీసులు కూడా చూసీచూడనట్టుగా వదిలివేస్తున్నారు. 
 
శ్రీలంక ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో కిలో టమోటాలు రూ.200కు పైగానే ధర పలుకుతుంది. అలాగే, కిలో క్యారెట్ రూ.500, కిలో మిర్చి రూ.700 చొప్పున పలుకుంది. ఇక పెట్రోల్, డీజిల్, గ్యాస్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. కనీసం చంటిబిడ్డలకు సైతం పాలపొడి లభించక అలమటిస్తున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో శ్రీలంక మహిళలు వేశ్య వృత్తిని ఎంచుకుంటున్నారు. గత కొన్ని రోజుల్లోనే శ్రీలంకలో వేశ్యవృత్తిలో నిమగ్నమైన మహిళల సంఖ్య ఏకంగా 30 శాతానికి పెరిగింది. కుటుంబ పోషణకు తమకు అంతకుమించి మరోమార్గం కనిపించడం లేదని వారు బోరున విలపిస్తూ చెబుతున్నారు. ఇక్కడ విస్మయం కలిగించే విషయం ఏంటంటే.. నూతనంగా వెలిసిన వ్యభిచార గృహాలకు పోలీసులు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Covid Booster dose: పోవయ్యా నాకెందుకు అనేవాళ్లకోసం...