Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బట్టలు సరిగ్గా ఉతకమని విసిగించింది.. కొత్త కత్తితో 66 సార్లు పొడిచి చంపేశాడు..

దుబాయ్‌లో ఓ పాకిస్థాన్ యువకుడు క్షణికావేశంలో హత్య చేశాడు. తన యజమానురాలిని కత్తితో పొడిచి చంపేశాడు. దుస్తులు సరిగ్గా ఉతకమని పదే పదే విసిగించడంతో ఆవేశానికి గురైన పాకిస్థానీ యువకుడు ఓనరమ్మను ఏకంగా 66 సార

బట్టలు సరిగ్గా ఉతకమని విసిగించింది.. కొత్త కత్తితో 66 సార్లు పొడిచి చంపేశాడు..
, బుధవారం, 23 ఆగస్టు 2017 (11:27 IST)
దుబాయ్‌లో ఓ పాకిస్థాన్ యువకుడు క్షణికావేశంలో హత్య చేశాడు. తన యజమానురాలిని కత్తితో పొడిచి చంపేశాడు. దుస్తులు సరిగ్గా ఉతకమని పదే పదే విసిగించడంతో ఆవేశానికి గురైన పాకిస్థానీ యువకుడు ఓనరమ్మను ఏకంగా 66 సార్లు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.

వివరాల్లోకి వెళితే.. 38 ఏళ్ల భారతీయుడు దుబాయ్‌లో సేల్స్  మేనేజరుగా పనిచేస్తున్నాడు. అతడు ఓ ఫిలిప్పీన్ యువతి ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ ఒకే ఫ్లాటులో సహజీవనం చేస్తుండగా.. బట్టలుతకడం కోసం ఓ పాకిస్థానీ యువకుడిని నియమించుకోవడం ద్వారా ఊహించని ఘటన చోటుచేసుకుంది. 
 
25 పాకిస్థాన్ యువకుడిని తమ దుస్తులు ఉతికేందుకు ఆ ప్రేమ జంట నియమించుకుంది. రెండు రోజులకు ఒకసారి వచ్చి దుస్తులను ఉతికి ఆరేసి వెళ్లిపోతుంటాడు. ఓ రోజు ఫిలిప్పీన్ యువతి ఒక్కతే ఇంట్లో వుండగా పాకిస్థాన్ పౌరుడు వచ్చాడు. ఆమె కొన్ని దుస్తులను ఇచ్చి ఉతకమంది. అంతటితో ఆగకుండా దుస్తులు సరిగ్గా వుతుకున్నాడో లేదో చూసేందుకు అతడి చుట్టూ తిరిగింది. 
 
సరిగా ఉతకమని ఆదేశాలిస్తూ పదేపదే అతడిని విసిగించసాగింది. మీరిక్కడి నుంచి వెళ్ళండి మేడమ్.. ఉతికిన తర్వాత శుభ్రంగా లేదంటే చెప్పండి అంటూ పాకిస్థాన్ యువకుడు అసహనం వ్యక్తం చేశాడు. దీంతో ఆగ్రహించిన ఆమె... అతడి వద్ద ఉన్న బకెట్‌ను కాలితో తన్ని.. తాను చెప్పినట్లు చేయమంది అంతటితో ఆగకుండా అవమానకరమైన పదాలతో దూషించింది.
 
అంతే ఆ యువకుడికి చిర్రెత్తుకొచ్చింది. పని ముగించుకుని ఫ్లాట్ నుంచి బయటికొచ్చి అదే రోజున మధ్యాహ్నం ఇంటి తలుపు కొట్టాడు. ఆమె డోర్ తెరిచిందో లేదో చేతికి గ్లౌజ్ వేసుకుని అప్పటికే కొని పెట్టుకున్న కొత్త కత్తితో ఆమెపై దాడి చేసి చంపేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 66 పోట్లు పొడిచాడు. ఆపై ఇంట్లో ఉన్న డబ్బును తీసుకుని పారిపోయాడు. ప్రియురాలి మృత దేహం ఇంట్లో ఉండటాన్ని చూసి షాకైన భారతీయ పౌరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
పోలీసులు జరిపిన దర్యాప్తులో దుస్తులు ఉతికే పాక్ పౌరుడిపై అనుమానాలొచ్చాయి. అతడే నిందితుడని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడికి  జీవిత కాల జైలు శిక్ష విధించారు. క్షణికావేశంలో హత్య జరిగిపోయిందని.. ఆమెను కావాలనే తాను హతమార్చలేదని నిందితుడు ఎంత చెప్పుకున్నా న్యాయమూర్తి చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబును చంపాలా..? అయితే జగన్‌పై కేసు నమోదు చేయండి : ఈసీ