Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాట్సప్‌ను లండన్‌లో నిషేధిస్తారా...? మరి భారత్‌లో....?

పార్లమెంట్‌ ముంగిట్లో ఇటీవల ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో వాట్సప్‌కు మరిన్ని సమస్యలు తప్పేలా లేవు. వాట్సప్ అందిస్తోన్న ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వల్లే ఈ సమస్యలన్నీ. వివరాల్లోకి వెళ్తే - వినియోగదారుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా పంపే సందేశాలను స్వీక

వాట్సప్‌ను లండన్‌లో నిషేధిస్తారా...? మరి భారత్‌లో....?
, సోమవారం, 27 మార్చి 2017 (19:50 IST)
పార్లమెంట్‌ ముంగిట్లో ఇటీవల ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో వాట్సప్‌కు మరిన్ని సమస్యలు తప్పేలా లేవు. వాట్సప్ అందిస్తోన్న ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వల్లే ఈ సమస్యలన్నీ. వివరాల్లోకి వెళ్తే - వినియోగదారుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా పంపే సందేశాలను స్వీకరించేవారు తప్ప మరొకరు ఎవరూ డీక్రిప్ట్ చేయలేని విధంగా ఏర్పాట్లు చేసింది వాట్సప్. దీన్నే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అంటారు. 
 
ఆఖరికి ఆ సందేశాలను వాట్సప్ యాజమాన్యం తలచుకున్నా కూడా డీక్రిప్ట్ చేయలేదు. సరిగ్గా ఆ సదుపాయాన్నే ఆయుధంగా మలచుకున్న ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకు వేదికగా వాట్సప్‌ను మార్చుకున్నారు. లండన్ పార్లమెంట్‌పై దాడి జరగడానికి మూడు నిమిషాల ముందు పంపిన సందేశాన్ని డీక్రిప్ట్ చేయాలన్న లండన్ హోమ్ శాఖ అభ్యర్థనకు బదులుగా తాము చేయగలిగిందేమీ లేదని చేతులెత్తేసింది వాట్సప్ సంస్థ. 
 
ఈ తీరుపై మండిపడ్డ బ్రిటన్ ప్రభుత్వం దాడులు, ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ఇలాంటి కమ్యూనికేషన్ సదుపాయాలను అందిస్తున్న కంపెనీలు బాధ్యతతో ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. 
 
క్రిమినల్ పరిశోధనల్లో సహకరించడం లేదన్న కారణంతో గత సంవత్సరమే వాట్సప్‌ను బ్రెజిల్‌లో నిషేధించారు. యాపిల్, గూగుల్ కూడా పలు దేశాల్లో ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న సంగతి విదితమే. ఇటీవలే ఏదో లాభాలు తెస్తుందన్న నమ్మకంతో వాట్సప్‌ను కొన్న జుకెర్‌బెర్గ్‌కి ఇది పెద్ద తలనొప్పిగా తయారైంది. ఏం చేయాలో తెలియక ఫేస్‌బుక్ దిగ్గజం లీగల్ అడ్వైజర్లతో చర్చల్లో మునిగిపోయినట్లు సమాచారం. బ్రిటన్‌లో ఏం జరుగుతుందో చూసి భారత్ కూడా అదే దారిలో వెళ్లేందుకు రెడీ అవుతోందన్న వార్తలు జుకెర్‌కి వణుకుపుట్టిస్తున్నాయట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదనపు కట్నం తెచ్చాకే ఫస్ట్ నైట్.. భార్యకు నరకం చూపించిన భర్త.. బెంగళూరులో?