Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అదనపు కట్నం తెచ్చాకే ఫస్ట్ నైట్.. భార్యకు నరకం చూపించిన భర్త.. బెంగళూరులో?

అదనపు కట్నం తేకపోతే.. తొలిరాత్రి జరగబోదని, తన బెడ్ రూమ్‌కు రాకూడదని ఓ భర్త భార్యకు షరతు పెట్టాడు. అంతేగాకుండా ఇంట్లోనే చిత్రహింసలకు గురిచేశాడు. ఈ చిత్ర హింసలు ఏడాది పాటు భరించిన ఆ మహిళ.. ఇక లాభం లేదని

Advertiesment
Bangolore
, సోమవారం, 27 మార్చి 2017 (18:23 IST)
మహిళలకు ఓవైపు అత్యాచారాలు-మరోవైపు వేధింపులు.. ఇంకోవైపు వరకట్నం కోస చిత్రహింసలంటూ నరకం కనిపిస్తోంది. ఓ వైపు కామాంధులు మహిళలపై విరుచుకుపడుతుంటే.. మరోవైపు కట్టుకున్న భార్యను భర్తలే వరకట్నం తెమ్మని గృహహింసకు గురిచేస్తున్నారు.

తాజాగా అదనపు కట్నం తేకపోతే.. తొలిరాత్రి జరగబోదని, తన బెడ్ రూమ్‌కు రాకూడదని ఓ భర్త భార్యకు షరతు పెట్టాడు. అంతేగాకుండా ఇంట్లోనే చిత్రహింసలకు గురిచేశాడు. ఈ చిత్ర హింసలు ఏడాది పాటు భరించిన ఆ మహిళ.. ఇక లాభం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని మహాగణపతి నగర్‌లో మహేష్ అనే యువకుడు 2016లో 25ఏళ్ల యువతిని పెళ్లాడాడు. పెళ్లికి ముందే చెప్పిన కట్నాన్ని తేకుంటే తనతో సంసారం చేయనని.. బెడ్ రూమ్‌లోకి రాకూడదని మహేష్ భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ క్రమంలో ఆమెను మెడపట్టి ఎన్నోసార్లు గెంటేశాడని అతనిపై ఆరోపణలున్నాయి. 
 
అదనపు కట్నం తెచ్చేందుకుగాను పుట్టింటికి వెళ్లకపోతే చంపేస్తానని కూడా మహేష్ బెదిరించినట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తతో పాటు ఆయన కుటుంబీకులు సైతం తనను ఏడాది పాటు చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త వేధింపులు తట్టుకోలేక 2017 జనవరి 23వ తేదిన తను పుట్టింటికి వెళ్లిపోయానని, అయినా భర్త వేధింపులు ఆగలేదని.. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు వాపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్థరాత్రి వివాహితకు ఫోన్‌లో వేధింపులు.. భర్త డౌట్.. షీ టీమ్స్ సాయంతో?