కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో.. దక్షిణాఫ్రికాలో సింహాలు రోడ్లపైకి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఈ దృశ్యాన్ని పార్క్ రేంజర్ రిచర్డ్ సౌరీ తన మొబైల్ కెమెరాలో బంధించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మార్చ్ 25 నుంచి విధించిన లాక్ డౌన్‌తో క్రూగర్ వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం కూడా మూతపడింది. సాధారణంగా పెద్ద పులులు, సింహాలు రాత్రి పూట మాత్రమే రోడ్లపై కనిపిస్తాయి.
క్రూగర్ నేషనల్ పార్కులో సౌరి రేంజర్‌గా అత్యవసర విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఒర్పేన్ రెస్ట్ క్యాంపు వైపు వెళ్తుండగా ఆయనకి రోడ్డుపై సింహాలు కనిపించాయి. ఆయన ఐదు మీటర్ల దూరంలోనే ఉండి వాటిని గమనించారు. అవన్నీ నిద్రలో ఉండటం వలన ఆయన ఫొటోలు తీస్తున్నప్పుడు అవి పెద్దగా పట్టించుకోలేదు. వాహనాల్లో ప్రజలను చూడటం కూడా సింహాలకు అలవాటైపోయింది.