Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కామాంధ టెక్కీ : పక్కనే భార్యవున్నా.. యువతి ప్రైవేట్ భాగాలు నలిపేశాడు...

కట్టుకున్న భార్య పక్కనే ఉన్నప్పటికీ.. ఆ కామాంధ భర్త మాత్రం తన వక్రబుద్ధిని మానుకోలేదు. తన పక్క సీట్లో కూర్చున్న యువతి ప్రైవేట్ శరీర భాగాలను తడుముతూ కనిపించాడు. దీంతో బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసుల

Advertiesment
Indian Techie
, ఆదివారం, 19 ఆగస్టు 2018 (10:17 IST)
కట్టుకున్న భార్య పక్కనే ఉన్నప్పటికీ.. ఆ కామాంధ భర్త మాత్రం తన వక్రబుద్ధిని మానుకోలేదు. తన పక్క సీట్లో కూర్చున్న యువతి ప్రైవేట్ శరీర భాగాలను తడుముతూ కనిపించాడు. దీంతో బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ కామాంధుడుని అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
భారత్‌కు చెందిన ప్రభు రమణమూర్తి అనే టెక్కీ.. తన భార్యతో కలిసి రోచెస్టర్‌ హిల్స్‌ సిటీలో ఉంటున్నాడు. ఈయన అమెరికాలోని ఓ ఐటీ సంస్థలో మేనేజరుగా పనిచేస్తున్నాడు. ఏడు నెలల క్రితం తన భార్యతో కలిసి లాస్‌వేగాస్‌లో డెట్రాయిట్‌ వెళ్లే స్పిరిట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఎక్కాడు. 
 
ఆ ఫ్లైట్‌ జర్నీలో ఒక వైపు.. భార్య.. మరోవైపు ఓ ప్రయాణికురాలు కూర్చొంది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఆ యువతి నిద్రలోకి జారుకుంది. ఇదే అదునుగా భావించిన ప్రభు... పక్కనే భార్య ఉందన్న విషయాన్ని కూడా మరిచిపోయి.. యువతిపై లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ యువతికి మెలుకువ వచ్చి చూడగా షాక్‌కు గురైంది. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, 'నిద్ర పోతున్న నాకు శరీరం మీద ఏదో పాకుతున్నట్లు అనిపించింది. లేచి చూసేసరికి రమణమూర్తి నా ప్రైవేట్‌ శరీర భాగాలను తడుముతూ కనిపించాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశాను' అని చెప్పింది. ఈ వ్యవహారంపై ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు విచారణ చేపట్టారు. 
 
ఈ ఘటనపై తొలుత తనకేం తెలియదనీ, తాను గాఢ నిద్రలో ఉన్నానంటూ ప్రభు దబాయించాడు. కానీ పోలీసులు తమదైనశైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు. ఈ కేసును విచారించిన మిచిగాన్‌లోని డెట్రాయిట్‌ న్యాయస్థానం భారతీయ టెక్కీని దోషిగా తేల్చింది. వచ్చే డిసెంబరు 12న అతనికి జీవిత ఖైదు విధించే వీలున్నట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రా వంటకాలు‌... బాగా తినండి... ప‌దిహేను రోజుల పాటు...