Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికా సెక్స్ రాకెట్.. బిట్ పేపర్ దొరికింది.. సోదాల్లో డైరీలు, కండోమ్స్..?

అమెరికాలో వెలుగుచూసిన సెక్స్ రాకెట్లో ఓ చిత్తు కాగితం అత్యంత కీలకంగా మారింది. వ్యభిచార దందాపై ఓ పేపర్లో వున్న వివరాలను చూసిన పోలీసులకు అనుమానం కలిగింది. ఆ బిట్ పేపర్ ఆధారంగానే మోదుగుమూడి కిషన్, చంద్రక

అమెరికా సెక్స్ రాకెట్.. బిట్ పేపర్ దొరికింది.. సోదాల్లో డైరీలు, కండోమ్స్..?
, సోమవారం, 18 జూన్ 2018 (10:03 IST)
అమెరికాలో వెలుగుచూసిన సెక్స్ రాకెట్లో ఓ చిత్తు కాగితం అత్యంత కీలకంగా మారింది. వ్యభిచార దందాపై ఓ పేపర్లో వున్న వివరాలను చూసిన పోలీసులకు అనుమానం కలిగింది. ఆ బిట్ పేపర్ ఆధారంగానే మోదుగుమూడి కిషన్, చంద్రకళ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారని అధికారులు తెలిపారు.


ఇకపోతే.. ఈ సెక్స్ దందాలో గురువారం నాడు కిషన్ దంపతులను ఇల్లినాయిస్ కోర్టులో ప్రవేశపెట్టి, అభియోగాలపై విచారణను ప్రారంభించనున్నామని, ఆపై నెల రోజుల వ్యవధిలోగా కేసు కొలిక్కి వస్తుందని విచారిస్తున్న అధికారులు చెప్పారు. వారు చేసిన నేరాలపై కీలక ఆధారాల కోసం చూస్తున్నామన్నారు. 
 
ప్రస్తుతం వ్యభిచార దందాలో ఆరుగురి పేర్లు బయటకు వచ్చాయని, వీరిని సాక్షులుగా పేర్కొంటామని చెప్పిన అధికారులు, కిషన్ దంపతుల ఫోన్లను విశ్లేషిస్తున్నామని చెప్పారు. అలాగే ఈ సంవత్సరం జనవరిలో కిషన్ దంపతులను యునైటెడ్ స్టేట్స్ బోర్డర్ పెట్రోల్ సిబ్బంది, అక్రమంగా నివసిస్తున్న ఆరోపణలపై అరెస్ట్ చేయగా, ఫిబ్రవరి 23న వారు బయటకు వచ్చారు. కానీ ఇద్దరినీ అరెస్ట్ చేసిన సమయంలో వారి నుంచి అధికారులు కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకోగా, అందులో మారియట్ హోటల్ లెటర్ హెడ్‌తో ఉన్న పేపర్ ఒకటి ఉంది. 
 
దానిలో చేత్తో రాసిన కొన్ని అక్షరాలు ఉన్నాయి. హీరోయిన్‌ల పేర్లు, తేదీలు, రూమ్ నంబర్‌లు ఉన్నాయి. వాటిని చూసిన అధికారులకు, ఈ వివరాలు వ్యభిచారానికి సంబంధించినవేనని అనుమానం వచ్చింది. ఆపై కోర్టు అనుమతితో కిషన్ ఇంట్లో సెర్చ్ చేయగా, డబ్బు లావాదేవీలకు సంబంధించిన వివరాలున్న డైరీలు, భారీ ఎత్తున కండోమ్స్ లభించాయి. 
 
వీటిని చూసిన తరువాతే అధికారులు అన్ని ఎయిర్ పోర్టులనూ అలర్ట్ చేయగా, అమెరికాలో కాలు పెడుతున్న ప్రతి టాలీవుడ్ హీరోయిన్‌నూ అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం కెనడాకు తల్లిదండ్రులను చూసేందుకు వెళ్లిన టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్‌ను కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు అరగంట పాటు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గౌరీ లంకేశ్‌ను ''కుక్క'' అని నేరుగా ప్రస్తావించలేదు.. ప్రమోద్ ముథాలిక్ వివరణ