రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్న రష్యా విషయంలో తటస్థంగా ఉంటూ వస్తున్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాస్కోపై చర్యలు తీసుకునేందుకు భారత్ ఎందుకో బలహీనంగా ఉందని అన్నారు.
అమెరికా మిత్ర దేశాలన్నీ ఐక్యంగా ఉంటూ రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకొస్తుంటే.. ఢిల్లీ మాత్రం అస్థిరంగా, బలహీనంగా స్పందిస్తోందన్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు వ్యతిరేకంగా అమెరికా ఆధ్వర్యంలోని భాగస్వామ్య పక్షం, నాటో, ఐరోపా యూనియన్, ఆసియా భాగస్వామ్య దేశాలు ఐక్యంగా నిలబడడం పట్ల బైడెన్ అభినందించారు.