Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్ 22వ ప్రధాన మంత్రిగా ఇమ్రాన్ ఖాన్.. పాకిస్థాన్ బుద్ధి మారదా?

పాకిస్థాన్ 22వ ప్రధాన మంత్రిగా పీటీఐ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇమ్రాన్ చేత ఆ దేశాధ్యక్షుడు మామూన్ హుస్సేన్ ప్రమాణ స్వీకారం చేయించారు.

Advertiesment
Imran Khan
, శనివారం, 18 ఆగస్టు 2018 (11:52 IST)
పాకిస్థాన్ 22వ ప్రధాన మంత్రిగా పీటీఐ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇమ్రాన్ చేత ఆ దేశాధ్యక్షుడు మామూన్ హుస్సేన్ ప్రమాణ స్వీకారం చేయించారు.


ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ కమార్ జావేద్ భజ్వా, ఎయిర్ చీఫ్ మార్షల్ ముజాహిద్ అన్వార్ ఖాన్, నావెల్ చీఫ్ అడ్మిరల్ జాఫర్ మహముద్ అబ్బాసీ, ఇమ్రాన్ భార్య బుష్రా ఇమ్రాన్‌తో పాటు నటుడు జావిద్ షేక్‌, భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు, రమీజ్ రాజా, వసీం అక్రమ్, గాయకులు సల్మాన్ అహ్మద్, అబ్రూల్ హక్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. 
 
పార్లమెంటులోని దిగువ సభలో మొత్తం 342 సభ్యులుండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 172 ఓట్లు కావాలి. ప్రధాని పదవికి పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ పార్టీ అభ్యర్థి షాబాజ్ షరీఫ్ నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాని ఓటింగ్ వివిధ గ్యాలరీల్లో సభ్యుల విభజన ద్వారా ఓటింగ్ బహిరంగంగానే జరిగింది. 
 
ఓటింగ్ జరిగేప్పుడు పిపిపి శాసనసభ్యులు తమ సీట్లలోనే కూర్చుండిపోగా, జమాత్‌ఇఇస్లామీ ఓటింగ్‌లో పాల్గొన లేదు. ఓటింగ్ నుంచి గైర్హాజరు కావొద్దని బిలావల్ భుట్టో జర్దారీని షాబాజ్ షరీఫ్ కోరినప్పటికీ ఆయన తనను మన్నించమని తప్పుకున్నారు. ఓటింగ్‌లో ఇమ్రాన్ ఖాన్‌కు చిన్నాచితక పార్టీల మద్దతు లభించింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 
ఇదిలా ఉంటే.. దివంగత ప్రధాని వాజ్‌‌పేయికి నివాళులు అర్పించేందుకు వచ్చిన పాకిస్థాన్ మంత్రి సయ్యద్ అలీ జాఫర్ ఆ  పని మానేసి కాశ్మీర్ పల్లవి అందుకున్నారు. వాజ్‌పేయి రాసిన కవితలను గుర్తు చేస్తూ.. ఆయనో గొప్ప నేత అని కీర్తించారు. వాజ్‌పేయి దూరదృష్టి ఉన్న నేత అని కొనియాడారు. ఉపఖండం నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని ఆయన కలలు కన్నారని పేర్కొన్నారు. 
 
అంతేగాకుండా భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న వివాదాలన్నీ పరిష్కారం కావాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. చర్చల ద్వారానే కాశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆకాంక్షించారు. వాజ్‌పేయికి నివాళులు అర్పించేందుకు వచ్చిన ఆయన కాశ్మీర్‌పై కామెంట్లు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్ బుద్ధి మారదా అంటూ పలువురు ఫైర్ అవుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళలో భారీ వరదలు.. 300 మందికి పైగా మృతి.. తినడానికి తిండి లేక..?