పాకిస్థాన్ ఎన్నికల్లో గెలుపొందిన హిందువు... ఎలక్షన్ ఫైనల్ రిజల్ట్స్
తాజాగా పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓ హిందువు తొలిసారి విజయభేరీ మోగించారు. ఈయన జనరల్ కేటగిరీలో విజయం సాధించి రికార్డు సృష్టించాడు. ఆయన పేరు మహేశ్ కుమార్ మలానీ. థార్‌పార్కర్ నియోజ
తాజాగా పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఓ హిందువు తొలిసారి విజయభేరీ మోగించారు. ఈయన జనరల్ కేటగిరీలో విజయం సాధించి రికార్డు సృష్టించాడు. ఆయన పేరు మహేశ్ కుమార్ మలానీ. థార్‌పార్కర్ నియోజకవర్గం నుంచి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) తరపున మహేశ్ బరిలోకి దిగారు.
ఈయన సమీప అభ్యర్థి గ్రాండ్ డెమొక్రటికల్ అలియన్స్‌కు చెందిన అరబ్ జాకవుల్లాపై గెలుపొందారు. మహేశ్ మలాని పాకిస్థానీ హిందూ రాజస్థానీ పుష్కర్ణ బ్రహ్మణ కుటుంబంలో జన్మించారు. 2003లో పీపీపీ నుంచి పార్లమెంటు రిజర్వ్‌డ్ సీటుకు నామినేట్ అయ్యారు. 2013లో సింధ్ శాసనసభకు ఎన్నికయ్యారు.
కాగా, పాకిస్థాన్ ఎన్నికల ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. తుది ఫలితాలు వెల్లడైన తర్వాత ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని తెహ్రీక్ పార్టీ 119 స్థానాలు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఇక నవాజ్ షరీఫ్ పార్టీ... పీఎంఎల్ -ఎన్ 63 స్థానాలు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 38, ఇతరులు 50 స్థానాల్లో గెలుపొందారు. మేజిక్ ఫిగర్ 137 స్థానాలు కావడంతో స్వతంత్రులు కీలకం కానున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకన్న పీటీఐ పార్టీ... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.