Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రధాని షెబాజ్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి - రెచ్చిపోతున్న ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు

roits in pakistan
, గురువారం, 11 మే 2023 (10:18 IST)
పాకిస్థాన్‌లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. ఆ దేశ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత, క్రికెట్ లెజెండ్, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌ను భూబదిలీ అవినీతి కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు వెలువల పాక్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన మద్దతుదారులు ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా దాడులకు తెగబడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా పాకిస్థాన్ దేశంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పి, హింసాకాండ సాగుతోంది. తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. అలాగే, గత రెండు రోజుల్లో 14 ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు. 21 పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. లండన్‌లోని పాక్ ప్రధాని ఇంటిని కూడా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదాతురులు చుట్టుముట్టారు. 
 
మరోవైపు, లాహార్‌లోని ప్రధాని షరీఫ్ నివాసంపై పెట్రోల్ బాంబులు విసిరినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. ఆందోళనకారులు ప్రధాని నివాసానికి చేరుకున్నపుడు అక్కడ గార్డులు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. అక్కడి పోలీసు పోస్టుకు వారు నిప్పుపెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసు బలగాలు అక్కడకు చేరుకునేలోపు ఆందోళనకారులు అక్కడ నుంచి జారుకున్నారు. 
 
అంతకుముందు వారు పీఎంఎల్ - ఎన్ కార్యాలయంపైనా దాడికి పాల్పడ్డారు. అక్కడున్న బారికేడ్లను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. పంజాబ్ రాష్ట్రంలో రెండు రోజుల్లో మొత్తం 14 ప్రభుత్వ భవనాలు, 21 పోలీసు వాహనాలుక నిప్పు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. అలాగే, పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు కూడా లండన్‍లోని షెబాజ్ షరీఫ్ ఇంటిని చుట్టుముట్టారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత చెలరేగిన హింసాకాండలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా 300 మందికిపై గాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.150 కోసం బండరాయితో కొట్టి చంపేశారు... సైకో మృత్యుకేళి