Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాలో కాల్పులు.. తెలుగమ్మాయి మృతి

telugu student
, సోమవారం, 8 మే 2023 (09:24 IST)
అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలుగమ్మాయి మృతి చెందింది. టెక్సాస్‌లోని డాలస్‌కు ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలెన్‌ ప్రీమియర్‌ దుకాణ సముదాయంలో శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దుర్ఘటనలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ కాల్పుల్లో తెలంగాణకు చెందిన  తాటికొండ ఐశ్వర్య కూడా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఐశ్వర్య తండ్రి రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పని చేస్తున్నారు. 
 
కాల్పుల మోతతో దద్ధరిల్లిన అగ్రరాజ్యం...
 
అగ్రరాజ్యం అమెరికా మరోమారు కాల్పుల మోతతో దద్ధరిల్లింది. టెక్సాస్ రాష్ట్రంలోని ఆలెన్ నంగరంలోని ఓ షాపింగ్ మాల్‌లో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏకంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ దండుగుకు కనిపించిన వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఆ తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఆలెన్ నగరంలోని ఓ షాపింగ్ మాల్‌లోని పరిసర ప్రాంతాల్లో శనివారం ఈ దండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఫుట్‌పాత్‌పై నడుస్తూ కనిపించిన వారిపై కాల్పులకు తెగబడినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నట్టు నగర పోలీస్ చీఫ్ బ్రయన్ హార్వీ ప్రకటించారు. 
 
ఈ ఘటనపై స్పందించిన టెక్సాస్ రాష్ట్ర గవర్నర్... ఇది మాటలకు అందని విషాదమని వ్యాఖ్యానించారు. స్థానిక అధికారులకు, బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 
 
కాగా, అమెరికా ఈ యేడాది ఇప్పటివరకు 198 కాల్పుల ఘటనలు వెలుగు చూశాయి. 2016 తర్వాత ఇవే అత్యధిక ఘటనలు కావడం గమనార్హం. 2021లో అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనల్లో సుమారు 49 వేల మంది మరణించగా, 2020లో 45 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరిగాలో గన్ కల్చర్ నానాటికీ పెరిగిపోతున్న విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రైవేట్ బైక్ ట్యాక్సీలో ప్రయాణించిన మహిళ.. కిందపడి మృతి