అంతర్జాతీయ స్థాయిలో భాగ్యనగరానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన హైటెక్ సిటీ 23 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. హైదరాబాద్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సిటీనే హైటెక్ సిటీ అని పిలుస్తున్నారు. పని ప్రారంభించిన 14నెలల్లోనే ఈ సైబర్ టవర్ నిర్మాణం పూర్తిచేశారు.
అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనసులో మెదిలిన మానస పుత్రిక. ప్రపంచ పుటల్లో హైదరాబాద్‌ను ఓ వెలుగు వెలిగేలా చేసింది. దీంతో ఎంతోమంది ఐటీ దిగ్గజాల కన్ను హైదరాబాద్‌పై పడింది. ఐటీ రంగానికి మరో సిలికాన్ సిటీగా నిలిచింది.
ఈ హైటెక్ సిటీ 67 ఎకరాల్లో విస్తర్ణంలో నిర్మితమైంది. ఈ హైటెక్ సిటీలో ఎన్నో ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. లక్షలమందికి ఉపాధి అవకాశాలు లభించాయి. హైటెక్ సిటీ ప్రారంభంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థే పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఐటీగా కేరాఫ్‌గా బెంగుళూరు ఉండేది. కానీ బెంగుళూరుకు ధీటుగా భాగ్యనగరంలో ఐటీ హబ్‌ను నిర్మించారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు.
దీంతో పేరుగాంచిన పెద్ద పెద్ద ఐటీ కంపెనీలన్నీ ఇక్కడ కార్యకలాపాలు జరుపుతున్నాయి. హైటెక్ సిటీ చుట్టూ పలు వ్యాపార సంస్థలు... స్టార్ మోటల్స్ హాస్పిటల్స్ ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కనకవర్షం కురిపిస్తోంది.