Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుద్ధి మార్చుకోని డ్రాగన్ కంట్రీ.. జీ-7కు చైనా వార్నింగ్

Advertiesment
బుద్ధి మార్చుకోని డ్రాగన్ కంట్రీ.. జీ-7కు చైనా వార్నింగ్
, సోమవారం, 14 జూన్ 2021 (12:14 IST)
ప్రపంచవ్యాప్తంగా అతలాకుతం అవుతున్న కరోనా మహమ్మారికి కేరాఫ్ అడ్రస్ అయిన చైనా ఇప్పటికీ తన బుద్ధి మార్చుకోవడం లేదు. జీ-7 దేశాల సమావేశంలో భవిష్యత్తులో ఇటువంటి మహమ్మారులు తిరిగి తలెత్తకుండా చూస్తామని ఒక ప్రకటనలో హామీ ఇచ్చాయి. ఈ మేరకు గ్లోబల్‌ హెల్త్‌ డిక్లరేషన్‌పై జీ-7 నేతలు సంతకాలు చేశారు. చైనా నుంచి భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సిద్దంగా అన్ని దేశాలు ఉండాలని అమెరికా పిలుపునిచ్చింది. అయితే, దీనిపై చైనా భగ్గుమంది.
 
జీ 7 దేశాల సమావేశంలో ప్రస్తుత మహమ్మారి గురించి విపులంగా చర్చించారు. చైనా నుంచే కరోనా వైరస్ వచ్చిందని, ఊహాన్‌లో ఉన్న వైరాలజీ ల్యాబ్ నుంచి ఈ మహమ్మారి బయటకు వచ్చిందన్న గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను మరింత నొక్కి చెప్పేందుకు అమెరికా ప్రస్తుత అధ్యకుడు జో బైడెన్ జీ 7 సమావేశం వేదికగా చేసుకున్నారు. 
 
చైనాపై ఉక్కుపాదం మోపేందుకు గ్లోబల్‌ నిఘా, వైరస్‌ జన్యు చిత్ర పటాన్ని రూపొందించడం వంటి వాటిపై ఒప్పందం కుదుర్చుకున్నారు. వ్యాక్సిన్‌ విధానం, కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం కోలుకుంటున్న తీరు, వాతావరణ మార్పులు గురించి చర్చించారు. చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టుకు ప్రతిగా ఇన్వెస్టిమెంట్‌ ప్లాన్‌ను జి-7 కూటమి ముందుకు తీసుకొచ్చింది. 
 
అయితే, భవిష్యత్తులో చైనా ద్వారా ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న పిలుపుపై జీ7 దేశాలకు చైనా వార్నింగ్ ఇచ్చింది. చిన్న కూటములతో తమను భయపెట్టాలని చూడటం తగదని చైనా పేర్కొంది. ప్రపంచ దేశాలకు చెందిన నిర్ణయాలు అన్ని ముఖ్యమైన దేశాలతో సంప్రదించిన తరువాత నిర్ణయాలు తీసుకోవాలని చైనా తెలిపింది. అన్ని దేశాలు తమకు సమానమే అని నీతులు చెప్పింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

World Blood Donor Day: మీరిచ్చే రక్తంలోని ఒక యూనిట్‌తో ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చు