Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

World Blood Donor Day: మీరిచ్చే రక్తంలోని ఒక యూనిట్‌తో ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చు

Advertiesment
World Blood Donor Day: మీరిచ్చే రక్తంలోని ఒక యూనిట్‌తో ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చు
, సోమవారం, 14 జూన్ 2021 (11:54 IST)
ప్రతి సంవత్సరం, ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని జూన్ 14 న జరుపుకుంటారు, అవసరమైన రోగులకు సురక్షితమైన రక్తం, దాని ఉత్పత్తుల లభ్యతను పెంచడానికి క్రమం తప్పకుండా రక్తదానం చేయవలసిన అవసరం గురించి అవగాహన పెంచుతుంది. రక్తం దానం చేసి ప్రాణాపాయ స్థితిలో వున్నవారి ప్రాణాలను రక్షించేందుకు స్వచ్ఛందంగా ఇచ్చే దాతలకు కృతజ్ఞతలు చెప్పే సందర్భం కూడా ఈ రోజు. గొప్ప ప్రయోజనంలో స్వచ్ఛందంగా పనిచేయడానికి వెనుకాడే ఇతరులకు ఇది ప్రోత్సాహకంగా కూడా పనిచేస్తుంది.
 
"ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, రక్త మార్పిడి అనేక ప్రాణాలను రక్షించగలదు, కాని చాలా సార్లు రక్తమార్పిడి అవసరమయ్యే రోగులకు సురక్షితమైన రక్తాన్ని సులభంగా పొందలేరు. చాలాసార్లు, ప్రాణాంతక పరిస్థితులతో బాధపడుతున్న రోగులను రక్తదానం ద్వారా సేవ్ చేయవచ్చు. కానీ, రక్తదానం ప్రాణాలను కాపాడటంలో సహాయపడటమే కాక, దాతకు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలుసుకోవాలి” అని డాక్టర్ సందీప్ జస్సాల్ అన్నారు.
 
రక్తదానం చేయాలనే అందరికీ ఉంటుంది. కాని కొందరిలో అపోహలు అధికంగా ఉంటాయి. తాము రక్తదానం చేయవచ్చో లేదో అని, ఇంకా పలు అనుమానాలు వారిలో ఉంటాయి. ఇలాంటి అనుమానాలకు తావివ్వద్దని వైద్యులు సూచిస్తున్నారు. రక్తదానం చేస్తే ముగ్గురి ప్రాణాలను కాపాడగలరని వైద్యులు తెలిపారు.
 
సాధారణంగా మనిషి శరీరంలో 5 నుంచి 6 లీటర్లదాకా రక్తం ఉంటుంది. రక్త దానం ఇవ్వడంతో శరీరంలోని రక్తం కేవలం మూడు వందల మిల్లీలీటర్ల రక్తమే తగ్గుతుంది. శరీరం ఈ తగ్గుదలను దాదాపు 24 గంటలనుంచి 48 గంటలలోపు పూర్తి చేసుకుంటుంది. అంటే రెండు రోజులలోనే శరీరం తన పూర్వవైభవాన్ని పుణికి పుచ్చుకుంటుందంటున్నారు వైద్యులు.
 
మనిషి శరీరంలోని బరువులో కేవలం 7శాతం మాత్రమే రక్తం ఉంటుంది.
 
మీరిచ్చే రక్తంలోని ఒక యూనిట్ రక్తంతో ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చు.
 
ప్రముఖంగా, విరివిగా లభించే రక్తం గ్రూపు 'ఓ', ఏబీ-నెగెటివ్. ఇది అందరి శరీరాల్లోను ఉంటుందని వైద్యులు చెపుతున్నారు.
 
2007వ సంవత్సరంలో శాస్త్రజ్ఞులు ఎంజైములను ప్రయోగించి ఏ, బీ, ఏబీ గ్రూపులను ఓ గ్రూపుగా మార్పుచేసి సత్ఫలితాలను సాధించారు. కాని ఇంకా దీనిని మనిషికి ఉపయోగించలేదు. మనిషికి ఉపయోగించి సత్ఫలితాలను సాధిస్తే రక్త కొరత కొంతమేరకు తీర్చినట్లేనని వైద్యులు భావిస్తున్నారు.
 
పేద, ధనిక దేశాలలో రక్తదానం చేసిన తర్వాత కూడా అక్కడి రక్తంలో కేవలం 45శాతం మాత్రమే ఉపయోగించారని లెక్కలు చెపుతున్నాయి.
 
దేశంలోని జనాభాలో కనీసం 1 నుంచి 3 శాతం మేరకు ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తే ఆ దేశంలోని రక్తపు కొరత తీరుతుంది. కాని ప్రంపంచంలోని 73 దేశాలలోని ప్రజలు ఆయా దేశాల జనసంఖ్యలో 1 శాతానికన్నాకూడా తక్కువ సంఖ్యలో ప్రజలు రక్తదానం చేస్తున్నారని సర్వేలు చెపుతున్నాయి.
 
స్వచ్ఛందంగా రక్తదానం చేసినవారినుంచే రక్తాన్ని స్వీకరించాలని, అమ్మే రక్తాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. అంటే రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సంస్థభావిస్తోంది.
 
స్వచ్ఛందంగా రక్తదానం చేసినవారి రక్తం రోగులకు చాలా బాగా ఉపయోగపడుతోందని సర్వేలు చెపుతున్నాయి. దీంతోపాటు వీరి రక్తంలో ఎలాంటి హానికరమైన జబ్బులు ఉదాహరణకు హెచ్ఐవీ, హెపటైటీస్ వైరస్‌లుండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని సర్వేలు వెల్లడించినట్లు విశ్లేషకులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూగ యువతిపై సామూహిక అత్యాచారం.. సెల్ ఫోనులో వీడియో తీసి..?