Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ట్రంప్ వెనుకంజ.. దూసుకెళుతున్న హిల్లరీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ ఆ దేశ రాజకీయ పరిణామాలు క్షణానికో విధంగా మారిపోతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిదో చెప్పలేక సర్వేలు కూడా ప్రజలను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. డె

Advertiesment
US president election
, ఆదివారం, 6 నవంబరు 2016 (08:59 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ ఆ దేశ రాజకీయ పరిణామాలు క్షణానికో విధంగా మారిపోతున్నాయి.  అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిదో చెప్పలేక సర్వేలు కూడా ప్రజలను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటనే రెండు పాయింట్లతో ముందున్నట్లు తాజా సర్వే ఒకటి తేల్చింది. 
 
ఫాక్స్‌న్యూస్‌ తాజా సర్వేలో ట్రంప్‌కు 43 శాతం, హిల్లరీకి 45 శాతం ఓట్లొచ్చాయి. వారం క్రితం 3 శాతం ఆధిక్యంతో ఉన్నారు. మూడు వారాల క్రితం 6 శాతం ఆధిక్యంతో ఉన్నారు. ఎఫ్‌బీఐ దర్యాప్తులతో హిల్లరీ ఆత్మరక్షణలో పడ్డారని సర్వేయర్లు తేల్చారు. సీఎన్‌ఎన్‌ తాజా సర్వేలో హిల్లరీకి 268 ఎలక్ట్రోరల్‌ కాలేజీ ఓట్లు వస్తాయని ప్రకటించింది. 
 
విజయం ఖాయం కావాలంటే 270 తప్పనిసరి. ట్రంప్‌కు 204 ఓట్లు మాత్రమే వస్తాయని సీఎన్‌ఎన్‌ తేల్చింది. అన్ని సర్వేల్లో సగటున 1.6 శాతం హిల్లరీకి ఆధిక్యం ఉంది. ఆమె గెలిచే అవకాశాలు 67.8 శాతం ఉన్నాయని న్యూయార్క్‌ టైమ్స్‌ చెప్పగా, హ ఫింగ్టన్‌ పోస్టు దానిని 97.9 శాతంగా అంచనా వేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీరు రాజీనామా చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటాం.. ఎమ్మెల్యేకు యువతి ఫోన్