Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీరు రాజీనామా చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటాం.. ఎమ్మెల్యేకు యువతి ఫోన్

'ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చింది' అన్నట్లుగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రజా ప్రతినిధులకు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరిలో కాకుండా జనగాం జిల్లాలో చ

మీరు రాజీనామా చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటాం.. ఎమ్మెల్యేకు యువతి ఫోన్
, ఆదివారం, 6 నవంబరు 2016 (08:44 IST)
'ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చింది' అన్నట్లుగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రజా ప్రతినిధులకు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరిలో కాకుండా జనగాం జిల్లాలో చేర్చడం వల్ల తొలి నుంచి నిరసన వ్యక్తమవుతోంది. తమ మండలాన్ని జనగాం జిల్లాలో కలపడాన్ని జీర్ణించుకోలేని ఓ యువతి.. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డికి ఓ యువతి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. తమ మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపకుంటే ఆత్మహత్య చేసుకుంటామని ఫోనులో బెదిరించింది. 
 
దీనికి ఎమ్మెల్యే బదులిస్తూ 'అది నేను కలపలేదు, సీఎం కేసీఆర్‌ కలిపారు. నీవు ఏమైనా అడగదల్చుకుంటే ఆయన్నే అడగాలి'.. అని చెప్పారు. దీంతో ఆ యువతి.. 'మేం మీకు ఓటేసి గెలిపిస్తే మీరు సీఎంను అడగమంటే ఎలా?' అని నిలదీసింది. అంతేకాకుండా 'మీరు కలపమని చెప్పకపోయి ఉంటే, వెంటనే మీ పదవికి రాజీనామా చేయండి, లేనట్టయితే నేను ఆత్మహత్య చేసుకుంటాను..' అని చెప్పింది. కాస్త గట్టిగా స్పందించిన ప్రభుత్వ విప్‌.. 'ఏం ఆత్మహత్య చేసుకుంటానని నన్ను బెదిరిస్తున్నావా'.. అంటూ ఫోన్ పెట్టేసింది. 
 
ఈ సమస్య అక్కడితో ముగిసినట్లే అని ఆలేరు ఎమ్మెల్యే భావించారు. కానీ కాసేపటికే ఆ యువతి.. 'ఉదయం 5 గంటలలోపు గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలిపేందుకు ఎమ్మెల్యే సునీత హామీ ఇవ్వనట్టయితే ఆత్మహత్య చేసుకుంటా'.. అంటూ 'మన గుండాల' వాట్సప్‌ గ్రూప్‌కు మెసేజ్‌ పంపింది. దాన్ని చూసిన ఎమ్మెల్యే కంగుతిన్నారు. వెంటనే విషయాన్ని జనగాం డీసీపీ వెంకన్న దృష్టికి తీసుకెళ్లారు. ఫోన్‌ చేసిన యువతి మాసాన్‌పల్లికి చెందిన కేమిడి స్వప్నగా గుర్తించిన డీసీపీ హుటాహుటిన రాత్రి 12 గంటల సమయంలో గ్రామానికి వెళ్లారు. 
 
అపుడు వికలాంగురాలైన స్వప్న తన గోడు వెళ్లబోసుకున్నారు. గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరిలో కాకుండా జనగాం జిల్లాలో కొనసాగించినట్లైతే తమ భవిష్యత్ దెబ్బతింటుందని, ఉద్యోగావకాశాలు రావని టెట్‌ రాసి డీఎస్సీకి సిద్ధమవుతున్న స్వప్న వాదించింది. పోరాటం చేయాలి తప్ప ఆత్మహత్య చేసుకుంటే సమస్య పరిష్కారం కాదని డీసీపీ ఆమెకు నచ్చజెప్పారు. ఆమె చదువుకు తగిన ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయని, అందువల్ల నిరుత్సాహానికి గురికావద్దని సముదాయించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా ఎన్నికలు : బూతులు తిట్టుకుంటున్న ట్రంప్, హిల్లరీ... అమెరికా పెద్దన్న పాత్ర గోవిందా...?!!