Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతీయ వైద్యుడికి రామన్ మెగసెస్ అవార్డు

ravi kannan
, శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (15:22 IST)
భారతీయ వైద్యుడికి అత్యంత ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసె అవార్డు వరించింది. ఆసియా ఖండపు నోబెల్ బహుమతిగా పరిగణించే ఈ అవార్డు చెన్నైకు చెందిన రవి కన్నన్ అనే వైద్య నిపుణిడికి వరిచింది. ఎలాంటి సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంత కేన్సర్ రోగులకు విశిష్ట సేవలందిస్తున్నందుకుగాను ఈ అవార్డు కోసం డాక్టర్ రవిని ఎంపిక చేశారు. 
 
ప్రస్తుత ఏడాదికి సంబంధించిన రామన్ మెగసెసె అవార్డు విజేతలను గురువారం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో నిర్వాహక కమిటీ ప్రకటించింది. సర్జికల్ ఆంకాలజిస్ట్ అయిన డాక్టర్ రవి కన్నన్ చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో కీలకమైన పదవిని త్యజించి ఈశాన్యభారత్‌లోని గ్రామీణ ప్రాంత రోగులకు సేవలను అందించడం ప్రారంభించారు. 
 
ఇందుకోసం ఆయన గత 2007లో 23 మంది సిబ్బందితో మొదలైన కచర్ కేన్సర్ ఆసుపత్రి, పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పి నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. ఫిలిపీన్స్‌కు చెందిన ప్రొఫెసర్ మిరియం కొరొనెల్ ఫెర్రర్, తూర్పు తైమూర్‌కు చెందిన యూజెనియో లెమోస్, బంగ్లాదేశ్‌కు చెందిన కొర్వి రక్షందలనూ పురస్కారం వరించింది. వీరికి నవంబరు 11న మనీలాలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డులను అందజేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భాగ్యనగరి వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు