Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో చరిత్ర పుటల్లో తొలి అధ్యక్షుడుగా ట్రంప్!

Advertiesment
అమెరికాలో చరిత్ర పుటల్లో తొలి అధ్యక్షుడుగా ట్రంప్!
, గురువారం, 14 జనవరి 2021 (07:44 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశ చరిత్ర పుటల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. అభిశంసనకు గురైన తొలి అధ్యక్షుడుగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ఆ దేశ ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఎంతగానో ప్రతిఘటించినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో అభిశంసనకు గురైన తొలి అధ్యక్షుడుగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోయాడు. అదీకూడా మరో వారం రోజుల్లో అధ్యక్షపీఠం నుంచి వైదొలగనున్న ఈ తరుణంలో ఆయన చివరి రోజులు అత్యంత అవమానకరంగా ముగిశాయి. 
 
డోనాల్డ్ ట్రంప్ ఇంతటి అవమానాన్ని ఎదుర్కోవడానికి ప్రధాన కారణం.. అమెరికాకు గుండెకాయలాంటి క్యాపిటల్ హిల్ భవనంపై ఆయన మద్దతుదారులను ఉసిగొల్పడమే. ఈ దాటి ఘటనతో అమెరికాతో పాటు ప్రపంచం కూడా ఒక్కసారి ఉలిక్కిపడింది. 
 
గత యేడాది నవంబరు నెలలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ గెలుపును నిర్ధారించేందుకు సమావేశమైన కేపిటల్ హిల్ భవనాన్ని చుట్టుముట్టిన ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు దీనిని అడ్డుకునే క్రమంలో హింసాత్మకంగా మారింది. నిరసనకారుల్లో నలుగురు చనిపోగా, ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు.
 
ఈ ఎన్నికల ఫలితాలను తాను అంగీకరించడం లేదనీ, తాను ఓడిపోలేదని పేర్కొంటూ వచ్చిన ట్రంప్... తన మద్దతుదారులను దాడికి ఉద్దేశ్యపూర్వకంగానే ప్రోత్సహించారంటూ ఆయనపై ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 
 
ఈ తీర్మానాన్ని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మెజారిటీ సభ్యులు మద్దతు పలకడంతో ట్రంప్ అభిశంసనకు గురయ్యారు. ఈ తీర్మానాన్ని సెనేట్‌కు పంపనున్నారు. కాగా, ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. అనంతరం ట్రంప్‌పై విచారణ జరగనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హెచ్‌ఆర్‌హెచ్‌ ప్రిన్స్‌ చార్లెస్‌ గ్లోబల్‌ సస్టెయినబల్‌ రికవరీ ప్లాన్‌ టెర్రా కార్టాకు దాల్మియా మద్దతు