Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వింత గుడ్లగూబ గురించి మీకు తెలుసా?

Advertiesment
strange owl
, శనివారం, 7 నవంబరు 2020 (09:15 IST)
వింత గుడ్లగూబ గురించి మీకు తెలుసా?.. సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఓ చిన్న అటవీప్రాంతంలో ఈ నింజా గుడ్లగూబ నివశిస్తోంది. నూర్దాక్ కామన్ అనే ప్రాంతానికి ఇది చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ స్థానికంగా నివశించే రాబ్ మోస్లీ అనే ఫొటోగ్రాఫర్‌కు ఈ గుడ్లగూబల విషయం తెలిసింది.

అతని స్నేహితురాలో అమ్మాయి వీటిని చూసి, మోస్లీకి విషయం చెప్పింది. ఈ గుడ్లగూబ గూడుకు దగ్గరలోని మగగూబ తచ్చట్లాడుతూ కాపలాకాస్తోంది. అదేసమయంలో ఆడగూబ గూడుకు అడ్డుగా నిలబడి పిల్లల్ని రక్షిస్తోంది. ఇలా కాపాడుకునే క్రమంలో చెట్టుకు ఆనుకొని దాక్కుంటోంది. ఆ సమయంలో గనుక దాన్ని చూస్తే అక్కడ గుడ్లగూబ ఉందా? లేదా? అనే డౌట్ వచ్చేస్తుంది. అంతా చెట్టులో కలిసిపోయిందా తల్లి గుడ్లగూబ.

ఇక్కడ తిరుగుతుండే మనుషులకు ఈ గుడ్లగూ బ అలవాటు పడిపోయిందని మోస్లీ చెప్పారు. ఈ కారణంగానే తన గూటికి దగ్గరగా మనుషులు వచ్చినా పెద్దగా పట్టించుకోవడంలేదట. అయితే మరీ దగ్గరగా వెళ్తేమాత్రం కోపం చూపిస్తోందని మోస్లీ వివరించారు.

ఈ తల్లి గుడ్లగూబ గూడు దగ్గర లేనప్పుడు పిల్లలు కొద్దిగా బయటకు వచ్చి గూట్లోనుంచి తొంగి చూస్తున్నాయి. వీటిని కూడా మోస్లీ తన కెమెరాలో బంధించారు. ఈ గుడ్లగూబ పిల్లలు చాలా ముద్దుగా ఉన్నాయని, అవి ఆరోగ్యంగా ఎదగాలని కోరుకుంటున్నట్లు మోస్లీ తెలిపారు.
 
‘‘సాధారణంగా ఈ గుడ్లగూబను పట్టుకోవడం కష్టం. అదీ ముఖ్యంగా తల్లిగూబ చెట్టులో కలిసిపోయినట్లుగా ఉండి, మన కంటికి కనిపించను కూడా కనిపించదు. అయితే ఇక్కడే మనం తెలివి చూపించాలి. మగ గుడ్లగూబ ఎక్కువగా తిరుగుతున్న ప్రాంతాన్ని పసిగట్టాలి. ఇది కొంచెం కష్టమైన పనే అయినా మగ గుడ్లగూబను కనిపెట్టొచ్చు. అది దొరికిందంటే ఆ పరిసరాల్లో తల్లిగూబ ఎక్కడైనా దాక్కునేలా అనువైన ప్రాంతం ఎక్కడుంతో పసిగట్టాలి.

అలాంటి ప్రాంతాలను జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడో ఓ చోట ఈ గుడ్లగూబ చెట్టులో కలిసిపోయినట్లుగా కూర్చొని కనిపిస్తుంది’’ అని మోస్లీ తన కష్టాలు చెప్పుకొచ్చారు. అయితే సోషల్ మీడియాలో ఈ గుడ్లగూబ ఫొటోలు తెగవైరల్ అవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ జే-ట్యాక్స్ వల్లే రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలు: టీడీపీ