Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇన్‌స్టాగ్రాంలో మహిళా కోచ్‌కు విద్యార్థి లైక్... లైంగికంగా లోబరుచుకున్న మహిళా కోచ్

ఈమధ్య కాలంలో కొంతమంది ఉపాధ్యాయులు-విద్యార్థులు గురుశిష్యుల సంబంధం కాకుండా లైంగిక సంబంధం పెట్టుకుని వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి కేసులు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇలాంటి కేసు ఒకటి బయటకు వచ్చింది. అమెరికాలోని బాస్కెట్ బాల్ కోచ్‌గా విధ

Advertiesment
Crime
, శనివారం, 13 జనవరి 2018 (15:57 IST)
ఈమధ్య కాలంలో కొంతమంది ఉపాధ్యాయులు-విద్యార్థులు గురుశిష్యుల సంబంధం కాకుండా లైంగిక సంబంధం పెట్టుకుని వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి కేసులు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇలాంటి కేసు ఒకటి బయటకు వచ్చింది. అమెరికాలోని బాస్కెట్ బాల్ కోచ్‌గా విధులు నిర్వహిస్తున్న మహిళా కోచ్ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుని అరెస్టయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే... 26 ఏళ్ల ఆన్‌కురోకి ఓ స్కూలులో బాస్కెట్ బాల్ కోచ్‌గా విధులు నిర్వహిస్తోంది. ఓ రోజు 17 ఏళ్ల విద్యార్థి తను పరీక్షలు రాసేందుకు తర్ఫీదునివ్వాల్సిందిగా సదరు మహిళా కోచ్‌ను అభ్యర్థించాడు. దాని గురించి ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రాంలో మహిళా కోచ్ కురోకి పోస్ట్ చేసిన ఫోటోకు విద్యార్థి లైక్ చేసి పొగడ్తల జల్లు కురిపించాడు. మళ్లీ విద్యార్థి కోచ్‌తో ఫోనులో మాటలు కలిపాడు. 
 
ఈ క్రమంలో ఓ రోజు విద్యార్థికి మహిళా కోచ్ ఫోన్ చేసి తను ఓ బార్‌లో మద్యం సేవించాననీ, ప్రస్తుత పరిస్థితిలో తను ఇంటికి వెళ్లలేననీ, తనను ఇంటి వద్ద దించేందుకు రావాలని కోరింది. దాంతో సదరు విద్యార్థి మహిళా కోచ్‌ను ఆమె ఇంటి వద్ద దిగబెట్టేందుకు వెళ్లాడు. ఆ క్రమంలో ఇద్దరూ లైంగికంగా కలిశారు. విద్యార్థి తరచూ మహిళా కోచ్ వద్దకు రావడం చూసి పాఠశాల యాజమాన్యం అనుమానపడి వారిపై నిఘా పెట్టింది. దీనితో విషయం కాస్తా బయటపడింది. 
 
మహిళా కోచ్ పైన పోలీసులకు స్కూలు యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో తొలుత మహిళా కోచ్ బుకాయించింది. విద్యార్థితో తనకు ఎలాంటి లైంగిక సంబంధం లేదని వాదించింది. కానీ విద్యార్థి తల్లి, తన కుమారుడు-మహిళా కోచ్ మధ్య జరిగిన లైంగిక వ్యవహారం తాలూకు వీడియోలను పోలీసులకు అప్పగించింది. దీనితో సదరు మహిళా కోచ్ తప్పు అంగీకరించింది. కానీ తను విద్యార్థితో బలవంతంగా సెక్సులో పాల్గొనలేదనీ, అతడే తనను రెచ్చగొట్టి సెక్స్ చేశాడని చెప్పుకొచ్చింది. ఏదేమైనప్పటికీ మైనర్ బాలుడితో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు అమెరికా చట్టాల ప్రకారం ఆమెకు శిక్ష విధిస్తామని పోలీసులు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓఎన్జీసీ హెలికాప్టర్ గల్లంతు.. నలుగురి మృతదేహాల వెలికితీత