Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా పరీక్షలపై చైనా ఖచ్చితమైన ఫలితాలు

Advertiesment
కరోనా పరీక్షలపై చైనా ఖచ్చితమైన ఫలితాలు
, సోమవారం, 29 జూన్ 2020 (10:29 IST)
చైనాకు చెందిన ఓ కంపెనీ కరోనా పై ఖచ్చితత్వం ఇచ్చే పరీక్షలను కనుగొంది.. తాము అభివృద్ధి చేసిన కరోనావ్యాక్సిన్‌ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని చైనా నేషనల్‌ బయోటెక్‌ గ్రూప్‌ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

తొలుత మనుషులపై ప్రయోగించిన వ్యాక్సిన్‌ ద్వారా అది సురక్షితమైందని నిర్ధారణ అయిందని, బీజింగ్‌లో తయారు చేసిన రెండో వ్యాక్సిన్‌ క్యాండిడేట్‌ ప్రోత్సాహకర ఫలితాలను ఇచ్చిందని పేర్కొంది. ఈ టీకాను తొలిదశ 1/2 క్లినికల్‌ ట్రైల్స్‌లో 1,120 మందికి ఇచ్చారు. వీరందరిలో యాంటీబాడీస్‌ను ఆ టీకా తయారు చేసిందని పేర్కొంది.
 
ఈ విషయాన్ని సీఎన్‌బీజీ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ వుయ్‌ఛాట్‌లో పోస్టు చేసింది. దీనికి అదనపు సమాచారాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతోపాటు వుహాన్‌లో ఇదే సంస్థకు చెందిన మరోశాఖలో అభివృద్ధి చేసిన ఇంకో టీకా కూడా మనుషుల్లో యాంటీబాడీస్‌ను ఉత్పత్తి జరిగేట్లు చేస్తోందని పేర్కొంది.

ఇప్పటికే చైనా అభివృద్ధి చేసిన పలు టీకాలను మానవులపై ప్రయోగించేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇక మూడో దశ ప్రయోగాల కోసం భారీ సంఖ్యలో వలంటీర్లను నియమించుకుంటోంది. దీంతోపాటు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో కూడా ఈ టీకా మూడో దశ ప్రయోగాలు నిర్వహించనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు చెప్పినట్లు పవన్‌ ఆడుతున్నాడు..చంద్రబాబు బాణీలకు నాట్యం చేస్తున్నాడు: మాజీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, ఆమంచి కృష్ణమోహన్‌