Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్యను టార్చర్ పెట్టి చితక్కొట్టిన కజికిస్థాన్ మాజీ మంత్రి...

kazak minister wife

ఠాగూర్

, శనివారం, 4 మే 2024 (14:31 IST)
కజికిస్థాన్‌ దేశానికి చెందిన మాజీ మంత్రి ఒకరు తన భార్యను ఏకంగా ఎనిమిది గంటల పాటు చిత్రహింసలకు గురిచేసి చితకబాదాడు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. 44 యేళ్ల కౌండ్యక్ బిషిమబేయెవ్ కజకిస్థాన్ ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఈయన 31 యేళ్ల భార్య సాల్టానంట్ నుకెనోవాపై ఆయన దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అవి కాస్తా వెలుగులోకి రావడంతో వైరల్ అయ్యాయి. దాదాపు ఎనిమిది గంటలపాటు ఆమె భార్యను నిర్బంధించి దాడి చేశారు.
 
తన భర్త బంధువుల రెస్టారెంట్‌లో నుకెనోవా గత యేడాది నవంబరులో విగతజీవిగా కనిపించారు. భర్తే ఆమెను దారుణంగా హింసించి చంపశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తొలుత ఈ ఆరోణలను ఆయన ఖండించారు. అయితే, కోర్టులో విచారణ సందర్భంగా ఆయన నేరాన్ని అంగీంకరించారు. అయితే, అమెను ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేయలేదని కోర్టుకు తెలిపారు. కానీ, ఆ దేశంలో మాత్రం మాజీ మంత్రిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కేసు విచారణ కోర్టులో సాగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగుజాతి బాగుండాలంటే సైకో పాలన పోవాలి : చంద్రబాబు పిలుపు