Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం.. యువకుడి అరెస్ట్.. తుపాకీ పేల్చడం రాదు.. కానీ?

Advertiesment
British man charged over attempt to kill Donald Trump at rally
, మంగళవారం, 21 జూన్ 2016 (11:35 IST)
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. లాస్‌వెగాస్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్‌పై దాడి చేయడానికి ప్రయత్నించిన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా తాను ట్రంప్‌ను చంపడానికి కాలిఫోర్నియా నుంచి లాస్‌వెగాస్‌ వచ్చినట్లు తెలిపినట్లు తెలిపారు. ట్రంప్ దాడి చేయడానికే ర్యాలీ ఒకరోజు ముందు తుపాకీ పేల్చడం నేర్చుకున్నానని తెలిపాడు. 
 
అంతకుముందు తాను ఎప్పుడూ తుపాకీ పేల్చలేదని చెప్పాడు. తాను గన్‌ తెచ్చుకుని ఉంటే మెటల్‌ డిటెక్టర్‌లో దొరికిపోతాను కాబట్టి తేలేదని వివరించాడు. గతేడాదిగా సాండ్‌ఫోర్డ్‌ ట్రంప్‌ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని.. చివరిగా ఇప్పుడు దాడి చేసే యత్నం చేశాడని పోలీసులు తెలిపారు. పట్టుబడిన ఆ యువకుడి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
లాస్‌వెగాస్‌లో ట్రంప్‌పై దాడి చేయడంలో విఫలమైతే మళ్లీ దాడి చేయాలని అనుకున్నట్లు యువకుడు తెలిపాడు. సాండ్‌ఫోర్డ్‌ అమెరికాలో గత 18 నెలలుగా ఉంటున్నాడు. హోబోకెన్‌, న్యూజెర్సీల్లో ఉన్న తర్వాత అతడు కాలిఫోర్నియా చేరుకున్నాడు. లాస్‌వెగాస్‌ ర్యాలీలో అమీల్‌ జాకోబ్‌ అనే పోలీస్‌ అధికారి గన్‌ అన్‌లాక్‌లో ఉందని, అదైతే సులువుగా కాల్పులు జరపొచ్చని ఆయన గన్‌ లాక్కొనే ప్రయత్నం చేసినట్లు విచారణలో యువకుడు పోలీసులకు తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యోగా చేయడం వల్లే మోడీ - చంద్రబాబు రెచ్చిపోతున్నారట.. సుజనా అలా ఎందుకన్నారు!