Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాఫీ షాపులోని అమ్మాయిని ఎత్తుకెళ్లి ఎలా ఏం చేస్తున్నాడో చూడండి (వీడియో)

వాషింగ్టన్‌లో కెంట్ నగరంలో దారుణం జరిగింది. ఓ కాఫీ షాపులో పనిచేసే అమ్మాయిని ఓ కామాంధుడు బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించి విఫలయ్యాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వ

Advertiesment
Bikini barista
, శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (13:46 IST)
వాషింగ్టన్‌లో కెంట్ నగరంలో దారుణం జరిగింది. ఓ కాఫీ షాపులో పనిచేసే అమ్మాయిని ఓ కామాంధుడు బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించి విఫలయ్యాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
స్థానికంగా హాటీ షాట్స్‌ ఎస్‌ప్రెస్సో అనే ఓ  కాఫీ షాపు ఉంది. కస్టమర్లకు బికినీ వేసుకుని 30 ఏళ్ల మేడ్‌లైన్‌ గుయింటో అనే మహిళ కాఫీ సర్వ్‌ చేస్తుంటుంది. ఈ తరహా రెస్టారెంట్లు కెంట్ నగరంలో అనేకం ఉన్నాయి. 
 
ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఆమె తన పని చేసుకుంటుండగా.. కిటికీ గుండా ఓ వ్యక్తి ప్రవేశించాడు. ఆమెపై పడి అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే ఎవరైనా వస్తారేమోనన్న భయంతో ఆమెను కత్తితో బెదిరించి కిటీకి గుండానే బయటకు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు.
 
దీనిపై బాధితురాలు స్పందించగా, 'చీకట్లో అతని నుంచి తప్పించుకునేందుకు శాయశక్తుల కృషి చేశా.. కానీ, లాభం లేకపోయింది. బయటకు తీసుకెళ్లాక అతను నన్ను గాయపరిచాడు. ప్రాణాలు పోయినా ఫర్వాలేదని అరిచా. నేను అంత ప్రతిఘటిస్తానని బహుశా అతను ఊహించకపోయి ఉంటాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు' అంటూ ఆ భయానక సంఘటనను గుర్తు చేసుకుంది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు.. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడు మైకేల్‌ రేనాల్డ్స్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతనికి నేర చరిత్ర ఉందని.. ఓ దోపిడీ కేసులో పదేళ్ల శిక్ష అనుభవించిన రేనాల్డ్స్‌ గత సెప్టెంబర్‌లో జైలు నుంచి విడుదలైనట్టు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి పోలీసులు ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మాయిలకు అదే ముఖ్యం.. పెళ్లి వాళ్లు చూసుకుంటారు: ఆమ్రపాలి