Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#Beer Belly ఆ వ్యక్తి కేకులు, పిజ్జాలు తింటే పొట్టలో ఆల్కహాల్ తయారవుతుంది.. తెలుసా?

Advertiesment
#Beer Belly ఆ వ్యక్తి కేకులు, పిజ్జాలు తింటే పొట్టలో ఆల్కహాల్ తయారవుతుంది.. తెలుసా?
, సోమవారం, 13 జులై 2020 (10:38 IST)
అమెరికాలో వింత ఘటన చోటుచేసుకుంది. న్యూజెర్సీలో డెనీ అనే వ్యక్తి కారు డ్రైవింగ్ చేశాడు. అతడికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేశారు. బాగా మద్యం తాగినట్లు తేల్చారు. తాను మద్యమే తాగలేదని డేనీ మొత్తుకున్నాడు. కానీ పోలీసులు వినిపించుకోలేదు. తాము చేసిన టెస్టుల్లో మద్యం బాగా తాగినట్లు ఉందని వాదించారు. 
 
మద్యం తాగి ఉంటే... తన నోట్లో మద్యం వాసన రావాలి కదా... అని ప్రశ్నించాడు. అయినా వాళ్లు నమ్మలేదు. బ్రీత్ ఎనలైజర్‌తో మూడుసార్లు చెక్ చెయ్యగా ప్రతిసారీ అతను బాగా తాగాడనే చెప్పింది. అందుకే అరెస్టు చేసి తీసుకుపోయారు. ఆ తర్వాత ఈ వివాదం మరింత పెద్దదైంది. దాంతో పోలీసులు ఓ డాక్టర్‌ని పిలిపించి మద్యం తాగిందీ లేందీ క్లారిటీ కావాలన్నారు. 
 
ఆ డాక్టర్ చెక్ చేసి... అతను మద్యం తాగలేదని చెప్పారు. దాంతో పోలీసులు షాకయ్యారు. మరైతే... బ్రీత్ ఎనలైజర్ ఎందుకలా చెప్పింది? అని అడిగితే... అతని పొట్టలో మద్యం తయారవుతోందని చెప్పాడు. అంతే పోలీసులతో పాటు డెనీ కూడా షాకయ్యారు. 
 
పొట్టలో బీర్ తయారవ్వడం అనేది కొంత మందిలో కామనే. దీన్నే ఆటో బ్రూవరీ సిండ్రోమ్ (ఏబీఎస్) అంటారు. అంటే... ఇలాంటి వ్యక్తులు ఆహారం తిన్నప్పుడు... వాటిలో కార్బోహైడ్రేట్స్... ఆల్కహాల్‌గా మారతాయి. కేకులు, పిజ్జాలు, బ్రెడ్‌లు తిన్నప్పుడు అవి ఆల్కహాల్‌గా మారతాయి. ప్రపంచంలో ఇలాంటి వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 
 
డాక్టర్ ద్వారా విషయం తెలుసుకున్న డేనీ... ఇకపై అలాంటివి తిననని తెలిపాడు. వాటి బదులుగా మాంసం, చేపలు, ఆకుకూరలు తింటానన్నాడు. తనను అరెస్టు చేయడం ద్వారా అసలు విషయం తెలిసిందని వెల్లడించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలయన్స్ జియోకు మహర్ధశ : క్వాల్‌కామ్ పెట్టుబడులు